- Telugu News Photo Gallery Sinus problem can be controlled with these home remedies, Check Here is Details in Telugu
Sinus: సైనస్ సమస్యను ఇంటి చిట్కాలతో ఇలా కంట్రోల్ చేయవచ్చు..
సైనస్ సమస్య అనేది దీర్ఘకాలిక సమస్యగా చెప్పొచ్చు. వాతావరణంలో పరిస్థితులు మారినప్పుడల్లా ఇది ఎటాక్ చేస్తుంది. ఈ సమస్యను తగ్గించడానికి శాశ్వతమైన చికిత్స ఇంకా లేదు. కాబట్టి ఇంటి చిట్కాలతో కూడా మనం రిలీఫ్ పొందవచ్చు. ఈ టిప్స్ సైనస్‌ను తగ్గించడంలో ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి..
Updated on: Jan 02, 2025 | 2:48 PM

ఎంతో మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో సైనస్ కూడా ఒకటి. సైనస్ వచ్చిందంటే అంత త్వరగా తగ్గదు. ముఖ్యంగా చలి కాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. దీనికి తాత్కాలిక ఉపశమనం తప్ప.. పూర్తి పరిష్కారం చూపే చికిత్సలు ఇప్పటికీ లేవు. సైనస్‌ను మనం ఇంటి చిట్కాలతో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు.

ఒక పాత్రలో నీరు వేయండి. అందులో కొద్దిగా పసుపు, మెంథాల్, వేప ఆకులు వేసి బాగా మరగనివ్వాలి. అనంతరం ఈ నీటితో ఆవిరి పట్టాలి. పై నుంచి ఒక దుప్పటి లాంటిది వేసుకుని.. ఆవిరి పడితే.. ముక్క మొత్తం క్లియర్ అవుతుంది. సైనస్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది.

సైనస్‌తో బాధ పడేవారు ఎప్పుడూ నీటిని తాగుతూ ఉండాలి. దీని వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. బాడీ హైడ్రేట్‌గా ఉంటే సైనస్ సమస్య తగ్గుతుంది. లేదంటే పెరిగే అవకాశాలు ఉన్నాయి.

అదే విధంగా మసాలాలు, కారం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. వీటిల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి సైనస్‌ను క్లియర్ చేసేందుకు హెల్ప్ చేస్తాయి.

గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపిన నీటిని కూడా తాగుతూ ఉండాలి. దీని వల్ల కూడా సైనస్ కంట్రోల్ అవుతుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ ఉదయాన్నే ఓ చిన్న కప్పు తాగండి. దీని వల్ల కూడా సైనస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




