అలసటతో తడి జుట్టుతో పడుకోవడం వల్ల జుట్టుకు, తల చర్మానికి తీవ్ర హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది చుండ్రు, జుట్టు రాలడం, స్కాల్ప్ దెబ్బతినడం, జుట్టు పెళుసుగా మారడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఏసీ గదిలో తడి జుట్టుతో నిద్రపోతే శరీర ఉష్ణోగ్రత పడిపోయే ప్రమాదం ఉంది.