సీతాఫలం ఎక్కువగా తిన్నారంటే.. మీ బాడీ గ్యారేజ్కే.. జర భద్రం..
Prudvi Battula
Images: Pinterest
19 December 2025
అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు ఏదైనా అతిగా తింటే అనర్థానికి దారి తీస్తుంది. సీతాఫలం ఎక్కువగా తింటే కొందరిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
సీతాఫలం
అలాగే రక్తపోటు, డయాబెటిస్ సమస్యలున్న వారు ఈ పండును మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి సీతాఫలంతో కలిగే దుష్ప్రభవాలేంటో తెలుసుకుందాం రండి.
రక్తపోటు, డయాబెటిస్ సమస్యలు
చాలా మందికి సీతాఫలం తినడం వల్ల ఒక్కోసారి దురద, దద్దుర్లు వంటి సమస్యలుతలెత్తవచ్చు.ఇలాంటి సమస్యలున్నవారు సీతాఫలం పండును తీసుకోకపోవడమే మంచిది.
దురద, దద్దుర్లు
జీర్ణ సమస్యలు ఉన్నవారు సీతాఫలాన్ని తినకూడదు. ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉన్న కారణంగా కడుపునొప్పి, విరేచనాలు, గ్యాస్ సమస్యలు వస్తాయి.
జీర్ణ సమస్యలు
సీతాఫలంలో ఐరన్ పుష్కలంగా ఉన్నందున ఎక్కువగా తినకూడదు. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల వాంతులు, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయి.
వాంతులు, వికారం
రక్తపోటు ఉన్నవారు సీతాఫలాలను మితంగా తినాలి. దీనిలోని గుణాలు అకస్మాత్తుగా రక్తపోటును తగ్గిస్తాయి. మైకం, మూర్ఛ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
మైకం, మూర్ఛ, డీహైడ్రేషన్
పుష్కలంగా ఉన్న క్యాలరీలు కారణంగా సీతాఫలంలో ఎక్కువగా తింటే బరువు పెరగవచ్చు. ఈ పండులో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది కూడా బరువును పెంచుతుంది.
బరువును పెంచుతుంది
సీతాఫలం గింజలు చర్మంపై, ముఖ్యంగా కళ్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వీటి పొడి వల్ల కొందరికీ దద్దుర్లు, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి.
కళ్లపై ప్రతికూల ప్రభావం
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇలాంటి జాబ్స్ ఎంచుకున్నారంటే.. మీన రాశివారికి తిరుగులేదట..
మీకు నచ్చేలా.. అందరు మెచ్చేలా.. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చెయ్యాలంటే.?
ఒకేలాంటి చేపల కూర బోర్ కొడుతుందా.? ఈ డిఫరెంట్ రెసిపీలు ట్రై చెయ్యండి..
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇలాంటి జాబ్స్ ఎంచుకున్నారంటే.. మీన రాశివారికి తిరుగులేదట..
మీకు నచ్చేలా.. అందరు మెచ్చేలా.. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చెయ్యాలంటే.?
ఒకేలాంటి చేపల కూర బోర్ కొడుతుందా.? ఈ డిఫరెంట్ రెసిపీలు ట్రై చెయ్యండి..