భారత GDPకి కొత్త ఛాలెంజ్.. తాజా రిపోర్ట్‌లో విస్తుపోయే అంశాలు

ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ 'ఆసియా-పసిఫిక్ క్లైమేట్ రిపోర్ట్' అనేక ఆందోళనలను వెల్లడించింది. ఈ నివేదికలో వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టం పెరగడం మరియు కార్మిక ఉత్పాదకత తగ్గడం తోపాటు తక్కువ ఆదాయం, బలహీన ఆర్థిక వ్యవస్థలు ఎక్కువగా దెబ్బతింటాయని పేర్కొంది. దీని వలన భారతదేశ జిడిపికి 24.7 శాతం నష్టం వాటిల్లుతుందని నివేదిక అంచనా వేసింది.

భారత GDPకి కొత్త ఛాలెంజ్.. తాజా రిపోర్ట్‌లో విస్తుపోయే అంశాలు
113143113
Follow us
Narsimha

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 04, 2024 | 7:07 PM

ఇతర దేశాలతో పోలిస్తే గత దశాబ్ధ కాలంగా మెరుగైన జీడీపీ సాధిస్తోంది భారత్. అయితే ముందు ముందు భారత జీడీపీ పెను సవాళ్లను ఎదుర్కోనుంది. తాజా నివేదికలో ఇదే తేలింది. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) ఆసియా-పసిఫిక్ క్లైమేట్ రిపోర్ట్’ లొ విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయి. వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టం పెరగడంతో పాటు కార్మిక ఉత్పాదకత తగ్గుతుందని పేర్కొంది. వాతావరణ మార్పుల వల్ల 2070 నాటికి ఆసియా, పసిఫిక్‌ దేశాలలో స్థూల జాతీయోత్పత్తి(GDP) 10 శాతం తగ్గి 16.9% నష్టపోబోతుందని.. భారతదేశంలో కూడా  ఈ నష్టం శాతం దాదాపుగా 24.7గా ఉండవచ్చని నివేదిక పేర్కొంది. వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టం పెరుగడమే కాకుండా… కార్మిక ఉత్పత్తి తగ్గుముఖం పడుతుందని తద్వారా ఉత్పాదకత నష్టానికి దారి తీస్తుందని పేర్కొంది. దీని మూలంగా తక్కువ ఆదాయం ఉన్నటువంటి బలహీనమైన ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తుంది అని ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) ఆసియా-పసిఫిక్ క్లైమేట్ రిపోర్ట్ లో ఆందోళన వ్యక్తం చేసింది.

వాతావరణ సంక్షోభం తీవ్రరూపం దాలిస్తే , ఆసియా-పసిఫిక్‌లో తీరప్రాంతంలో నివసిస్తున్న 300 మిలియన్ల మంది ప్రజలు ముంపునకు గురికానున్నారని పేర్కొంది. ట్రిలియన్ డాలర్ల విలువైన తీరప్రాంత ఆస్తులను కూడా నష్టపోవాల్సి వస్తుందని అని నివేదిక పేర్కొంది. వాతావరణ మార్పుల వలన Tropical cyclones, Heat waves తో పాటు అధిక వరదలు సంభవించే అవకాశముంది. ఇలా మారిన వాతావరణ పరిస్థితులు ఆర్థిక వ్యవస్థకు భారీ సవాళ్లని విసరడం ఖాయమని ADB ప్రెసిడెంట్ మసత్సుగు అసకవా అన్నారు. ఈ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి ఇప్పటినుంచే తక్షణ చర్యలు ప్రారంభించడం వల్ల కొంత ఉపశమనం లభించవచ్చు అని ఆయన పేర్కొన్నారు.

వివిధ దేశాల్లోని పరిస్థితులను అవగతం చేసిన ఈ సర్వే వాతావరణ మార్పుల కారణంగా చాలా దేశాలు తమ దేశ జీడీపీలో ఎక్కువ శాతం నష్టపోతున్నట్లు తెలిపింది. బంగ్లాదేశ్‌లో 10%, ఇండోనేషియాలో 30.15%, ఆగ్నేయాసియాలో 24.7%, పాకిస్థాన్‌లో 22%, పసిఫిక్‌లో 21.1%, ఫిలిప్పీన్స్‌లో 18.6% గా ఈ నష్టం ఉంటుందని అంచనా వేశారు. 2000 సంవత్సరం నుండి అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాలే ఈ గ్రీన్‌హౌస్ వాయు (GHG) ఉద్గారాల పెరుగుదలకు కారణమని స్పష్టం చేశారు. 20వ శతాబ్దంలో Greenhouse gases పెరుగుదలకు అభివృద్ధి చెందిన దేశాలే కారణమయ్యాయి. 21వ శతాబ్దం లోని మొదటి రెండు దశాబ్దాలలో, అభివృద్ధి చెందుతున్న ఆసియా ప్రాంతాలలో Greenhouse gases  లు వేగంగా పెరిగాయి. ఈ ప్రాంతంలోనే ప్రపంచ జనాభాలో 60% శాతం మంది జీవిస్తున్నారు. 2000లో ఆసియా ప్రాంతంలో పర్యావరణ కాలుష్య కారకాల మొత్తం 29.4గా ఉంటే, 2021 నాటికి ఇది 45.9 శాతం కి పెరిగింది. అదే సమయంలో, చైనా కాలుష్య ఉద్గార రేటు 30 ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?