Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. IRCTC నుంచి సూపర్‌ యాప్‌!

ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్, రిజర్వు చేయబడిన టిక్కెట్ బుకింగ్ కోసం దాని ప్రత్యేక రైట్స్‌తో 100 మిలియన్ల కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లను సాధించింది. ఇది అత్యధికంగా వినియోగించే రైల్వే అప్లికేషన్‌గా నిలిచింది.  IRCTC రూ.1,111.26 కోట్ల నికర లాభం, రూ. 4,270.18 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 453 మిలియన్లకు పైగా..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. IRCTC నుంచి సూపర్‌ యాప్‌!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 04, 2024 | 6:42 PM

భారత రైల్వే ప్రయాణికుల కోసం రకరకాల సదుపాయాలను తీసుకువస్తోంది. టెక్నాలజీ పెరిగిన తర్వాత సులభమైన రైల్వే సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. ఫోన్‌ యాప్‌ ద్వారానే అన్నో సదుపాయాలు ఉంటున్నాయి. త్వరలో భారతీయ రైల్వే ‘సూపర్ యాప్’ను తీసుకువస్తోంది. ప్రయాణికుల సేవలను ఒకే ప్లాట్‌ఫారమ్‌ వేదికగా తీసుకువచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ డిసెంబర్ చివరి నాటికి ఓ మొబైల్ అప్లికేషన్‌ను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే యోచిస్తోంది.ఈ మొబైల్‌ యాప్‌ అందుబాటులోకి వస్తే చాలా రకాల సేవలు పొందవచ్చు. ఐఆర్‌సీటీసీ కొత్తగా ప్రయాణికుల కోసం తీసుకువస్తున్న ఈ యాప్‌ ద్వారా రకరకాల సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ యాప్‌లో టికెట్ బుకింగ్, పీఎన్‌ఆర్‌ స్టేటస్, ట్రైన్‌ ట్రాకింగ్ ఒకే యాప్‌లో తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా మీరు ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఫుడ్‌ను కూడా ఆర్డర్‌ చేసుకోవచ్చు. ప్లాట్‌ఫామ్‌ టికెట్లు, సాధారణ ప్రవేశ టికెట్లను ఆన్‌లైన్‌లోనే తీసుకోవచ్చు. ఈ సూపర్ యాప్ డిసెంబర్ నెలాఖరులో అందుబాటులోకి రానునట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: ATM Card Charge: ఎస్‌బీఐ ఏటీఎం కార్డుపై ఎన్ని రకాల ఛార్జీలు విధిస్తారో తెలుసా?

ఇదిలా ఉండగా, రిజర్వు చేసే టిక్కెట్ బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్  యాప్ 100 మిలియన్ల కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లను సాధించింది. ఇది అత్యధికంగా వినియోగించే రైల్వే అప్లికేషన్‌గా నిలిచింది.  అలాగే  IRCTC రూ.1,111.26 కోట్ల నికర లాభం, రూ. 4,270.18 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 453 మిలియన్లకు పైగా బుకింగ్‌లను ప్రాసెస్ చేసిన టిక్కెట్ల విక్రయాలు మొత్తం ఆదాయంలో 30.33% వాటాను అందించాయని వారి వార్షిక నివేదికలో పేర్కొంది. UTS అప్లికేషన్, 10 మిలియన్ కంటే ఎక్కువ సార్లు డౌన్‌లోడ్స్‌ను సాధించింది.

ఇవి కూడా చదవండి

ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి IRCTC యాప్‌ను ఉపయోగిస్తున్నారు. రైలును ట్రాక్ చేయడానికి నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ యాప్, ఫిర్యాదుల కోసం 139 నంబర్‌ వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో రైల్వే సూపర్ యాప్ ద్వారా ఈ సేవలన్నీ ఒకే చోట అందుబాటులోకి వస్తాయి.

ప్రస్తుతం రైల్వే ప్రయాణికులు వివిధ యాప్‌లు, వెబ్‌సైట్‌లను ఉపయోగించాల్సి వస్తోంది. టిక్కెట్ల కోసం IRCTC, క్యాటరింగ్ కోసం IRCTC eCatering, ఏదైనా సహాయం కోసం Rail Madad, రిజర్వ్ చేయని టిక్కెట్ల కోసం UTS, రైలును ట్రాక్ చేయడానికి NTES వంటివి ఉన్నాయి.

ఇది కూడా చదవండి: PM Kisan Scheme: భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ ప్రయోజనం పొందవచ్చా? రూల్స్‌ ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి