PM Kisan Scheme: భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ ప్రయోజనం పొందవచ్చా? రూల్స్‌ ఏంటి?

భారత ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రజల కోసం వివిధ పథకాలను రూపొందించింది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దేశంలో రైతుల సంఖ్య తక్కువేమీ కాదు. ప్రభుత్వం రైతుల కోసం కూడా పథకాలు తీసుకువస్తుంది..

PM Kisan Scheme: భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ ప్రయోజనం పొందవచ్చా? రూల్స్‌ ఏంటి?
Follow us
Subhash Goud

|

Updated on: Nov 03, 2024 | 3:44 PM

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారు. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల స్కీమ్‌లు అందుబాటులో ఉండగా, అందులో పీఎం కిసాన్‌ స్కీమ్‌ ఒకటి. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.6000 ఆర్థిక సాయం అందిస్తుంది కేంద్రం. అయితే ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2000 చొప్పున అందిస్తోంది. ఈ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద భార్యాభర్తలిద్దరూ విడివిడిగా రూ.6000 ప్రయోజనం పొందవచ్చా? నియమాలు ఏమిటో తెలుసుకుందాం.

భారత ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రజల కోసం వివిధ పథకాలను రూపొందించింది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దేశంలో రైతుల సంఖ్య తక్కువేమీ కాదు. ప్రభుత్వం రైతుల కోసం కూడా పథకాలు తీసుకువస్తుంది. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాలకు రూ.2000 చొప్పున మూడు విడతలు అందిస్తోంది. ఇప్పటివరకు దేశంలోని 13 కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. అయితే భార్యాభర్తలిద్దరూ ఈ పథకాన్ని పొందలేరు.

ఇది కూడా చదవండి: UPI Services: ఈ నెలలో రెండు రోజులు యూపీఐ సేవలు బంద్‌.. ఎందుకో తెలుసా?

ఇవి కూడా చదవండి

భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి కిషన్ యోజన కింద ఒక రైతు కుటుంబంలో ఒక సభ్యునికి మాత్రమే పథకం కింద ప్రయోజనాలు అందుతాయి. ఆ నియమం ప్రకారం, భార్యాభర్తలు ఒకే కుటుంబానికి చెందినవారు. అటువంటి పరిస్థితిలో ఇద్దరికి ప్రయోజనం ఉండదు. ఒకరు మాత్రం ఈ పథకం ప్రయోజనం పొందవచ్చు. అదే విధంగా, ఇద్దరు సోదరులు ఒకే కుటుంబంలో నివసిస్తుంటే వారిలో ఎవరికీ ప్రయోజనం ఉండదు. అయితే అన్నదమ్ములిద్దరూ విడివిడిగా నివసిస్తుంటే, అలాగే వేరువేరు కుటుంబాలు కలిగి ఉంటే ఇద్దరూ వేర్వేరు ప్రయోజనాలను పొందవచ్చు.

ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలు, వారి పేరు మీద సాగు భూమి ఉన్నవారు ప్రయోజనాలకు అర్హులు. అలాగే 2 హెక్టార్ల వరకు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు ప్రయోజనం పొందుతారు. ఈ పథకం కింద పేద రైతులకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇది కూడా చదవండి: SIP Calculator: సిప్‌లో రూ.1000 ఇన్వెస్ట్‌మెంట్‌తో కోటి రూపాయల రాబడి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి