US President: ఇతర దేశాల ప్రధానులకంటే అమెరికా అధ్యక్షుడి కారు భిన్నమైనది.. ఎందుకో తెలుసా?
జో బిడెన్ అధికారిక కారు కాడిలాక్ లిమోసిన్. దీనిని 'ది బీస్ట్' అని పిలుస్తారు. అధ్యక్ష ఎన్నికల కారణంగా యావత్ ప్రపంచం చూపు అమెరికాపైనే ఉంది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందువల్ల అధ్యక్షుడి.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ నవంబర్ 5, 2024న నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీకి చెందిన కమలా హారిస్ తలపడుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పరిగణిస్తారు. అందుకోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అమెరికా ప్రెసిడెంట్ ఎక్కడికైనా వెళితే, అతని కోసం భద్రత పరంగా పకడ్బందీగా ఉండే కారును ఉపయోగిస్తారు. అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ ‘ది బీస్ట్’ కారులో ప్రయాణిస్తారు.
జో బిడెన్ అధికారిక కారు కాడిలాక్ లిమోసిన్. దీనిని ‘ది బీస్ట్’ అని పిలుస్తారు. అధ్యక్ష ఎన్నికల కారణంగా యావత్ ప్రపంచం చూపు అమెరికాపైనే ఉంది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందువల్ల అధ్యక్షుడి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదు. అమెరికా అధ్యక్షుడి ‘ది బీస్ట్’ కారు ఇతర దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షుల కార్ల కంటే ఎలా విభిన్నంగా ఉంటుందో తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: Tech Tips: మీ వాహనంలో పెట్రోల్ వేయిస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
ఓపెన్ కార్ నుండి ‘ది బీస్ట్’
తొలినాళ్లలో అమెరికా అధ్యక్షుడు ఓపెన్ కారులో ప్రయాణించేవారు. అయితే ఇప్పుడు ది బీస్ట్ అమెరికా అధ్యక్షుడి అధికారిక కారు. భద్రత పరంగా ఈ కారు చాలా శక్తివంతమైనది. ఇది జేమ్స్ బాండ్ సినిమా లాంటి కారు. ఇందులో డోర్ హ్యాండిల్ కారులోకి బలవంతంగా ప్రవేశించకుండా కరెంట్‌ను విడుదల చేస్తుంది. దాని ప్రతి తలుపు బోయింగ్ 757 డోర్ బరువుతో ఉంటుంది. ఇది కాడిలాక్ సెడాన్ కారు. ఇది 18 అడుగుల పొడవు ఉంటుంది. దీని బరువు 6,800 కిలోల నుంచి 9,100 కిలోల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
‘ది బీస్ట్’ ఫీచర్లు:
భద్రత గురించి మాట్లాడితే.. ఈ కారు ట్యాంక్ లాంటి అల్యూమినియం, సిరామిక్, స్టీల్ కవచంతో తయారు చేస్తారు. కారు వెలుపలి భాగం ఎనిమిది అంగుళాల మందంతో ఉంటుంది. దీని విండోస్ ఎక్కువ పొరలతో ఐదు అంగుళాల మందంతో ఉంటాయి.
- పంప్-యాక్షన్ షాట్‌గన్
- రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లు
- టియర్ గ్యాస్ గ్రెనేడ్లు
- స్టీల్ రిమ్
- పంక్చర్ ప్రూఫ్
- శాటిలైట్ ఫోన్
- అగ్నిమాపక వ్యవస్థ
- ఆక్సిజన్ వ్యవస్థ
ఇది కూడా చదవండి: Best Geyser: మీరు గీజర్ కొంటున్నారా? గ్యాస్ లేదా ఎలక్ట్రిక్.. ఏది బెస్ట్..!
ఈ కారు రసాయన దాడులను కూడా తట్టుకోగలదు. భారీ కాల్పులకు కూడా ఈ కారు దెబ్బతినదు. దీని ఇంధన ట్యాంక్‌కు పేలుడు సంభవించినప్పుడు ట్యాంక్ పేలకుండా ఉండే విధంగా ఓ రసాయన పూత ఉంటుంది. ఈ కారులో డ్రైవర్ కోసం ప్రత్యేక కంపార్ట్‌మెంట్ ఉంటుంది. అధ్యక్షుడికి సంబంధించిన బ్లడ్ గ్రూప్ రక్తం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు ఉంటాయి. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షుడికి అవసరమైతే ఎక్కించవచ్చు. దీని తయారీకి దాదాపు 132 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ కారు- మెర్సిడెస్ మేబ్యాక్ S650 గార్డ్:
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటైన మెర్సిడెస్ మేబ్యాక్ S650 గార్డ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణిస్తారు. ఈ కారు 15 మీటర్ల దూరంలో 15 కిలోల TNT పేలుడును సులభంగా తట్టుకోగలదు. మిలిటరీ-గ్రేడ్ కాల్పులు, గ్యాస్ దాడులు కూడా దానిని దెబ్బతీయవు. ఈ కారు VR10 భద్రతా స్థాయిని కలిగి ఉంది. ఇది అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కారు – ఓర్స్ సెనేట్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కారు ఓర్స్ సెనేట్. రష్యాకు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ NAMI ఈ కారును తయారు చేసింది. ఈ కారు 21.7 అడుగుల పొడవు, 6500 కిలోల బరువు ఉంటుంది. ఈ కారు 4.4 లీటర్ V8 ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది హైబ్రిడ్ కారు. ఇది పూర్తిగా నీటిలో మునిగిపోయినప్పటికీ రష్యా అధ్యక్షుడిని రక్షించగలదు. ఇందులో బాంబు ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్ సిస్టమ్ ఉంటుంది.
చైనీస్ ప్రీమియర్ జి జిన్‌పింగ్ కారు – హాంగ్కీ N501
చైనా ప్రధాని జీ జిన్‌పింగ్ ప్రయాణించే కారు హాంగ్కీ ఎన్ 501. Xi Jinping అధికారిక కారు Hongqi N501. ఈ లిమోసిన్ కారు తుపాకీ కాల్పులు, ప్రత్యక్ష బాంబు దాడులను సులభంగా తట్టుకోగలదు. చైనాలో ప్రభుత్వ కఠిన వైఖరి, భద్రత కారణంగా ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి