- Telugu News Photo Gallery Technology photos Careful while filling the petrol in the car, and bike no waste will go into the engine
Tech Tips: మీ వాహనంలో పెట్రోల్ వేయిస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
పెట్రోల్ నింపేటప్పుడు చేసే కొన్ని సాధారణ తప్పులు మీ కారు, బైక్ ఇంజిన్‌పై ప్రభావం చూపుతాయి. చాలామందికి తెలియకుండానే ఈ అజాగ్రత్తగా ఉంటారు. ఇది ఇంజిన్ పనితీరు, మైలేజీని ప్రభావితం చేస్తుంది. ఐదు సాధారణ తప్పులు ఏమిటి?
Updated on: Nov 02, 2024 | 12:44 PM

పెట్రోల్ ట్యాంక్ పూర్తిగా ఖాళీ అయ్యే వరకు వేచి ఉండటం హానికరం. ఎందుకంటే పెట్రోల్-డీజిల్ ట్యాంక్‌లో మురికి ఉంటుంది. పెట్రోల్ దాదాపు అయిపోయిన తర్వాత ఈ వ్యర్థాలు వాహనానికి పెట్రోల్ సరఫరా అయ్యే పంప్ ద్వారా ఇంజిన్‌లోకి వెళ్తుంది. ఆ వ్యర్థాల ద్వారా ఫిల్టర్ మూసుకుపోతుంది. దీని వల్ల వాహనంలో సమస్యలు తలెత్త అవకాశం ఉంది.

అత్యంత ముఖ్యమైనది ఇంధన నాణ్యత. కొంత మంది పెట్రోల్ నాణ్యత లేని చోట్ల నుంచి పెట్రోల్ ను వేసుకుంటారు. ఫలితంగా నాణ్యత లేని పెట్రోల్ ఇంజిన్‌లో పేరుకుపోతుంది. దాని పనితీరును ప్రభావితం చేస్తుంది.

పెట్రోల్ నింపిన తర్వాత ఫ్యూయల్ క్యాప్ సరిగ్గా అమర్చారా? లేదా అని జాగ్రత్తగా తనిఖీ చేయండి. లేకపోతే గాలి, తేమ ట్యాంక్‌లోకి ప్రవేశించవచ్చు. దీని కారణంగా, పెట్రోల్‌తో కలిపిన నీటి ఆవిరి ఇంధనం నాణ్యతను క్షీణింపజేస్తుంది. ఇది ఇంజిన్ పనితీరును ప్రభావితం చేస్తుంది.

కొంత మంది పెట్రోల్ ట్యాంక్‌ని నిత్యం నిండుగా ఉంచేందుకు పెట్రోల్ పంపులో పెట్రోల్ నింపుతూనే ఉంటారు. ఇది ఓవర్‌ఫిల్లింగ్‌కు దారితీస్తుంది. ఇది వెంట్ సిస్టమ్‌లోకి ఇంధనం లీకేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది ఇంజిన్‌ను ప్రభావితం చేస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

చాలా మంది హడావుడిగా పెట్రోల్ నింపుకునేటప్పుడు ఇంజన్ ఆన్‌లో ఉంచుతుంటారు. భద్రతా కోణం నుండి ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది మైలేజీని ప్రభావితం చేస్తుంది. ఇది ఇంజిన్ పనితీరును కూడా ప్రభావితం చేస్తుందని సూచిస్తున్నారు.




