Stored Food: రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన ఆహారం ఎన్ని గంటల తర్వాత తింటే ప్రమాదం..!

చాలా సార్లు మనం ఫ్రిజ్‌లో ఒక వారం పాటు పండ్లు, కూరగాయలను స్టోర్‌ చేస్తుంటాము. ఎక్కువ కాలం పాటు ఫ్రిజ్‌లో ఉంచిన కూరగాయలు, పండ్లు వాటి పోషక విలువలను కోల్పోతాయి. వాటిని తినడం వల్ల మీకు మంచి కంటే హాని ఎక్కువ. కూరగాయలు..

Stored Food: రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన ఆహారం ఎన్ని గంటల తర్వాత తింటే ప్రమాదం..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 03, 2024 | 12:25 PM

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో రిఫ్రిజిరేటర్‌ ఉంటుంది. చాలా మంది మిగిలిపోయిన ఆహారం గానీ, ఇతర పదార్థాలు కూడా ఫ్రిజ్‌లోనే ఉంచేస్తున్నారు. ఉప్పుడున్న బిజీ లైఫ్‌లో తాజాగా వండుకునేందుకు సాధ్యం కావడం లేదు. అందుకే వివిధ రకాల పదార్థాలు ముందస్తుగానే ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటున్నారు. ఆహారం త్వరగా చెడిపోకుండా ఉండేందుకు, ఎక్కువ సేపు పాడైపోకుండా ఉండేందుకు చాలా మంది రిఫ్రిజిరేటర్‌లో స్టోర్‌ చేసుకుంటున్నారు. సమయాన్ని ఆదా చేయడానికి ఈ రిఫ్రిజిరేటర్లు ఉపయోగపడుతున్నాయి. ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారం పాడైపోకుండా కాపాడుతుంది.

కూరగాయలు, పండ్లు పాడవకుండా ఉండటం ద్వారా ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. కానీ అన్ని ఆహారాలు ఎక్కువ కాలం ఉండవు. అందుకే రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన ఆహారం, పండ్లు, కూరగాయలు ఎంత సమయం తర్వాత తినకూడదో నిపుణులు వివరిస్తున్నారు. రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన వండిన అన్నం 1 రోజులోపు తినడం ఉత్తమం. ఆ తర్వాత తింటే ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మీరు వండిన ఆహారాన్ని రిఫ్రిజిరేటర్‌లో ఉంచినట్లయితే అది తక్కువ సమయంలో దాని పోషక విలువలను కోల్పోతుంది. అయితే ఆయుర్వేదం ప్రకారం, అన్ని వండిన ఆహార పదార్థాలు కేవలం 6 గంటల పాటు పోషకాహారాన్ని అందిస్తుంది. ఆ తర్వాత దానిలోని పోషకాలు కోల్పోతాయి. అందుకే ఏ పదార్థాలు ఎంత సేపు ఫ్రిజ్‌లో ఉంచాలన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

బ్రెడ్‌ ఫ్రిజ్‌లో ఉంచితే..

ఇక మీరు బ్రెడ్‌ని ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే అది తయారు చేసిన 12 నుండి 14 గంటలలోపు తినాలని సూచిస్తున్నారు. అలా చేయకపోతే, అందులో ఉన్న పోషకాలు పోతాయి. ఎక్కువసేపు ఫ్రిజ్‌లో ఉంచిన బ్రెడ్‌ను తిన్నట్లయితే మీకు కడుపు నొప్పి రావచ్చంటున్నారు. మీరు మీ భోజనంలో మిగిలిపోయిన పప్పును చెడిపోకుండా ఉండటానికి మీరు ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే, దానిని 2 రోజులలోపు తినండి. రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచిన పప్పును 2 రోజుల తర్వాత తింటే, కడుపులో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది.

చాలా సార్లు మనం ఫ్రిజ్‌లో ఒక వారం పాటు పండ్లు, కూరగాయలను స్టోర్‌ చేస్తుంటాము. ఎక్కువ కాలం పాటు ఫ్రిజ్‌లో ఉంచిన కూరగాయలు, పండ్లు వాటి పోషక విలువలను కోల్పోతాయి. వాటిని తినడం వల్ల మీకు మంచి కంటే హాని ఎక్కువ. కూరగాయలు, పండ్లు కోయకుండా 3 నుండి 4 రోజులు ఉంచవచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు ఉంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

మీరు తరిగిన పండ్లను ఉంచినట్లయితే కేవలం 6 గంటలలోపు తినాలి. లేకుంటే మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. బియ్యం, పప్పు, రోటీ లేదా రోటీ పిండి వంటి ఏదైనా రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన తర్వాత అన్ని వస్తువులను పూర్తిగా పాత్రతో కప్పి, వండిన ఆహారాన్ని 24 గంటల్లోపు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA