HDFC UPI Transactions: హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు షాక్.. రెండు రోజుల పాటు యూపీఐ సేవల నిలిపివేత

భారతదేశంలో 2016లో నోట్లను రద్దు చేసిన ఆన్‌లైన్ చెల్లింపులు అధికమయ్యాయి. ముఖ్యంగా ఎన్‌పీసీఐ ప్రవేశపెట్టిన యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఏ చెల్లింపు అయినా ఫోన్‌పే ఉందా? అనే స్థాయికు ఇవి ప్రజాదరణ పొందాయి. తాజాగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. రెండు రోజులపాటు యూపీఐ సేవలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ తాజా ప్రకటన గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

HDFC UPI Transactions: హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు షాక్.. రెండు రోజుల పాటు యూపీఐ సేవల నిలిపివేత
New Upi Payment Rules
Follow us

|

Updated on: Nov 03, 2024 | 6:45 PM

హెచ్‌డీఎఫ్‌సీ వెబ్‌సైట్‌లో ఉంచిన ప్రకటన ప్రకారం నవంబర్ నెలలో రెండు పాటు యూపీఐ సేవలను నిలిపేస్తామని పేర్కొంది. అవసరమైన సిస్టమ్ అవసరాలను అప్‌డేట్ చేసేందుకు నవంబర్ 5న, 23న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని వివరించింది. నవంబర్ 05న అర్ధరాత్రి 12 గంట నుంచి రెండు గంటల వరకు, నవంబర్ 23న కూడా అర్ధరాత్రి 12 గంటల నుంచి మూడు గంటల వరకు కస్టమర్లకు యూపీఐ సేవలను అందుబాటులో ఉండవు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కరెంట్ & సేవింగ్స్ ఖాతా, రూపే క్రెడిట్ కార్డ్‌పై ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ యూపీఐ లావాదేవీలు అందుబాటులో ఉండవు. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యూపీఐ హ్యాండిల్‌ని ఉపయోగించి బ్యాంక్ ఖాతాదారులందరికీ హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, జీ పే, వాట్సాప్ పే, పేటీఎం, శ్రీరామ్ ఫైనాన్స్, మొబిక్విక్, క్రెడిట్ పేలో ఆర్థిక, ఆర్థికేతర యూపీఐ లావాదేవీల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొనుగోలు చేసిన వ్యాపారులకు అన్ని యూపీఐ లావాదేవీలు అందుబాటులో ఉండవు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ అనేది ప్రత్యేకమైన యూపీఐ ఉపయోగించి డబ్బును చెల్లించడానికి/ స్వీకరించడానికి పాల్గొనే బ్యాంక్ కస్టమర్ల కోసం స్మార్ట్ ఫోన్ న్ ఎనేబుల్డ్ ఫండ్ బదిలీ ఆప్షన్‌గా ప్రస్తుతం అందుబాటులో ఉంది. అలాగే మీరు ఈ యూపీఐ చెల్లింపులు ట్రాన్స్‌యాక్షన్ హిస్టరీ ట్యాబ్‌లో గత లావాదేవీలను వీక్షించవచ్చు. 

సాధారణంగా యూపీఐ పిన్ తప్పుగా ఎంటర్ చేసినా, అకౌంట్‌లో తగినంత సొమ్ము లేకపోయినా యూపీఐ లావాదేవీలు తిరస్కరణకు గురవుతాయి. అయితే బ్యాంకులు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లావాదేవీలను నిలిపేసిన సమయంలో కూడా యూపీఐ లావాదేవీలు తిరస్కరణకు గురవుతాయి. అందువల్ల కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ సమయంలో లావాదేవీలను నిలిపేయాలని బ్యాంకులు కోరుతూ ఉంటాయి. అలాగే యాక్టివ్ బ్యాంక్ అకౌంట్‌తో పాటు ఆ అకౌంట్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్, యాక్టివ్ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఉన్న ఎవరైనా యూపీఐ సేవలను ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి