AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్‌ కార్డులో మొబైల్‌ నంబర్‌ను ఎన్నిసార్లు అప్‌డేట్‌ చేయవచ్చో తెలుసా?

Aadhaar Card: ఆధార్‌ కార్డు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఇది లేనిది ఏ పని జరగదు. ఆధార్‌ కార్డ్‌లో మొబైల్ నంబర్‌ని ఎన్ని సార్లు అప్‌డేట్ చేయవచ్చు..? దీనికి ఏదైనా పరిమితి ఉందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Aadhaar Card: ఆధార్‌ కార్డులో మొబైల్‌ నంబర్‌ను ఎన్నిసార్లు అప్‌డేట్‌ చేయవచ్చో తెలుసా?
Subhash Goud
|

Updated on: Nov 03, 2024 | 5:23 PM

Share

భారతదేశంలో వివిధ ప్రయోజనాల కోసం అనేక విభిన్న పత్రాలు జారీ చేస్తుంటారు. వీటిలో చాలా పత్రాలు గుర్తింపు కార్డులుగా ఉపయోగిస్తుంటారు. గుర్తింపు పత్రాల్లో అతి ముఖ్యమైనది ఆధార్‌. ప్రస్తుతం ఆధార్‌ లేనిది ఏ పని జరగని పరిస్థితి ఉంది. అనేక ప్రయోజనాల కోసం ఆధార్‌ను ఉపయోగిస్తుంటాము. భారతదేశ జనాభాలో 90 శాతం మందికి ఆధార్ కార్డు ఉంది. ప్రతిరోజూ ఏదో ఒక పనికి ఆధార్ కార్డు కావాలి. ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా, స్కూల్ లేదా కాలేజీలో అడ్మిషన్ తీసుకోవావాలన్నా మీ ఆధార్ కార్డును రుజువుగా అందించాలి.

చాలా సార్లు ప్రజలు ఆధార్ కార్డులో తప్పుడు సమాచారాన్ని అప్‌డేట్ చేస్తుంటారు. పొరపాట్లను సరి చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. భారతదేశంలో ఆధార్ కార్డుకు సంబంధించిన అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు UIDAI ద్వారా ఉన్నాయి. మీరు UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కూడా ఆధార్‌ను అప్‌డేట్ చేయవచ్చు.

ఇదిలా ఉంటే ఆధార్ కార్డ్‌లో మొబైల్ నంబర్‌ను ఎన్నిసార్లు అప్‌డేట్ చేయవచ్చనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. అలాగే ఆధార్ కార్డ్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి పరిమితి లేదు. ఎన్ని సార్లైనా అప్‌డేట్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. అంటే మీరు మీ ఆధార్ కార్డ్‌లోని మీ నంబర్‌ను మీకు కావలసినన్ని సార్లు అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే దీని కోసం ప్రతిసారి నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. ఇప్పుడు ఆధార్ కార్డ్‌లో మొబైల్ నంబర్‌ను ఎలా అప్‌డేట్ చేయాలి చూద్దాం.

ఇవి కూడా చదవండి

ఆధార్ కేంద్రానికి వెళ్లి అక్కడి నుంచి అప్‌డేట్ ఫారమ్ తీసుకోవాలి. మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి మీరు ఫారమ్‌ను టిక్ చేయాలి. ఆ తర్వాత మీరు కొత్త మొబైల్ నంబర్ సమాచారాన్ని నమోదు చేయాలి. ఇందు కోసం కొంత రుసుము చెల్లించాలి. దీని తర్వాత నంబర్ అప్‌డేట్‌ అవుతుంది.

ఇది కూడా చదవండి: UPI Services: ఈ నెలలో రెండు రోజులు యూపీఐ సేవలు బంద్‌.. ఎందుకో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏనుగుల దినోత్సవం.. ఇంత తెలివైనవా? అచ్చం మనుషుల్లానే చేస్తాయా
ఏనుగుల దినోత్సవం.. ఇంత తెలివైనవా? అచ్చం మనుషుల్లానే చేస్తాయా
దేవుడి ముందు ప్రార్థిస్తున్నప్పుడు చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి?..
దేవుడి ముందు ప్రార్థిస్తున్నప్పుడు చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి?..
ఎయిర్‌ పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా
ఎయిర్‌ పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
2026లో భారత్‌లో అత్యధిక జీతాలు అందించే టాప్ 10 ఉద్యోగాలు..
2026లో భారత్‌లో అత్యధిక జీతాలు అందించే టాప్ 10 ఉద్యోగాలు..
కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది..
కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది..
సామాన్యులకు రైల్వేశాఖ బిగ్ రిలీఫ్..
సామాన్యులకు రైల్వేశాఖ బిగ్ రిలీఫ్..
16 సోమవారాల వ్రతానికి శ్రావణ మాసమే ఎందుకు ప్రత్యేకం? దీని వెనుక..
16 సోమవారాల వ్రతానికి శ్రావణ మాసమే ఎందుకు ప్రత్యేకం? దీని వెనుక..
తెలంగాణ తరహాలో స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ డాక్టర్ల డిమాండ్
తెలంగాణ తరహాలో స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ డాక్టర్ల డిమాండ్
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు.. మారనున్న రూపురేఖలు..
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు.. మారనున్న రూపురేఖలు..