ICICI Credit Cards: క్రెడిట్‌కార్డు హోల్డర్లకు ఆ బ్యాంకు షాక్.. చార్జీల బాదుడు షురూ

ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా ప్రతి ఉద్యోగస్తుడికి ఓ క్రెడిట్ కార్డు ఉంటుందంటే వీటి వినియోగం ఎలా ఉందో? అర్థం చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డుదారులను ప్రోత్సహించేందుకు చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డుల వినియోగం ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నాయి. కానీ ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం ఇటీవల తన క్రెడిట్ కార్డుల నిబంధనలు సవరించింది. ముఖ్యంగా కొన్ని సేవలపై ప్రత్యేక చార్జీలను విధించింది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు తాజా నిబంధనల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ICICI Credit Cards: క్రెడిట్‌కార్డు హోల్డర్లకు ఆ బ్యాంకు షాక్.. చార్జీల బాదుడు షురూ
Follow us
Srinu

|

Updated on: Nov 03, 2024 | 6:30 PM

ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల నిబంధనలను మార్చింది. వివిధ క్రెడిట్ కార్డ్‌లపై ప్రోత్సాహకాలను తగ్గించింది. బీమా, ఆహార కొనుగోళ్లు, విమానాశ్రయ లాంజ్ యాక్సెస్, ఇందన సర్‌చార్జ్ మినహాయింపు, లేట్ పేమెంట్ జరిమానాలు వంటి సేవలపై తాజా నిబంధనలు ప్రభావం చూపుతాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పటికే తన క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు మార్పుల గురించి ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేసింది. ముఖ్యంగా యుటిలిటీ ఖర్చుల కోసం రివార్డ్ పాయింట్లను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రూ.80000 రివార్డ్ పాయింట్‌ల పరిమితిని ప్రస్తుతం రూ.40,000కు తగ్గించారు. అలాగే కిరాణా & డిపార్ట్‌మెంటల్ స్టోర్‌ల కోసం నెలకు రూ.40,000 వరకు రివార్డ్ పాయింట్‌లను పొంవచ్చని చెబుతున్నారు. అయితే కిరాణా, డిపార్ట్‌మెంటల్ స్టోర్‌ల కోసం నెలకు రూ.20,000 వరకు ఖర్చు చేసే రివార్డ్ పాయింట్‌లను ప్రస్తుత సంపాదన రేటు ప్రకారం పొంవచ్చు.

ప్రభుత్వ సంబంధిత ఖర్చులు మినహా ఐసీఐసీఐ బ్యాంక్ ఎమరాల్డే ప్రైవేట్ మెటల్ క్రెడిట్ కార్డ్ ఖర్చులపై మీరు రివార్డ్ పాయింట్‌లను పొందవచ్చని ఐసీఐసీఐ తాజా నోట్‌లో పేర్కొంది.  ఇంధనంపై ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపులు నెలకు రూ. 50,000కు మాత్రమే పరిమిం చేసింది. అలాగే రూ. 100కు మించిన ఖర్చులకు ఇంధన సర్‌చార్జి మినహాయింపు ఉండదు. అలాగే స్పా యాక్సెస్ అందించే డ్రీమ్ ఫోక్స్ కార్డుపై ఇక ఆ సేవలు అందుబాటులో ఉండవు. వార్షిక రుసుము రివర్సల్, ప్రయోజనాల కోసం ఖర్చు థ్రెషోల్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన అద్దె, విద్యా చెల్లింపులను మినహాయిస్తుంది. వార్షిక రుసుముకు సంబంధించిన రివర్సల్ కోసం ఖర్చు థ్రెషోల్డ్ రూ.లఓకు సవరించారు. మీ క్రెడిట్ కార్డ్ నుండి అంతర్జాతీయ విద్యా చెల్లింపులతో సహా పాఠశాల లేదా కళాశాలకు నేరుగా చేసిన చెల్లింపులకు రుసుము వసూలు చేయరు. అయితే, థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా చేసిన విద్య చెల్లింపులకు లావాదేవీ మొత్తంలో 1 శాతం రుసుము వసూలు చేస్తారు. 

ఇంధన లావాదేవీకి రూ.10 వేలుకు మించి చేస్తే 1 శాతం రుసులు వసూలు చేస్తారు. అలాగే యాడ్ ఆన్ కార్డులకు వార్షిక రుసుము కింద రూ. 199 వసూలు చేస్తారు. లేట్ పేమెంట్స్ చార్జీలను కూడా పేమెంట్ బకాయికు అనుగుణంగా రూ.100 నుంచి రూ.1100 వరకు పెంచారు. అలాగే విమానాశ్రయాల్లో దేశీయ లాంజ్ యాక్సెస్ కోసం త్రైమాసికానికి కచ్చితంగా రూ.75 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే రివాల్వింగ్ క్రెడిట్ సదుపాయం కోసం రిటైల్ లావాదేవీలు, నగదు అడ్వాన్స్‌లు నెలకు 3.75 శాతానికి సవరించారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే