Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Finance Tips: పండుగల వేళ ఆ తప్పులు చేస్తున్నారా..? అప్పుల బాధ తప్పదంతే..!

ప్రస్తుతం భారతదేశంలో పండుగల సీజన్‌ నడుస్తుంది. ఇంకా దీపావళి సందడి కనిపిస్తుంది. పండుగల వేళ ఖర్చులు సామాన్యులను భయపెడుతూ ఉంటాయి. వేడుక అంటే అనుకోని ఖర్చు అనే పద్ధతికి సామాన్యుడు వచ్చేశాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పండుగల వేళ అప్పుల ఊబిలో దిగిపోకుండా నిపుణులు కొన్ని చిట్కాలను చెబుతున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

Personal Finance Tips: పండుగల వేళ ఆ తప్పులు చేస్తున్నారా..? అప్పుల బాధ తప్పదంతే..!
Money
Follow us
Srinu

|

Updated on: Nov 03, 2024 | 6:12 PM

పండుగల సీజన్‌లో చాలా మంది ప్రజలు తమ బడ్జెట్‌లోనే పండుగలు జరుపుకోవడానికి ప్లాన్ చేసుకుంటారు. అయితే గొప్పలకు పోయి అధిక ఖర్చులు చేసి అప్పుల పాలు అవుతూ ఉంటారు. కాబట్టి కచ్చితంగా పండుగల ఖర్చును మీ ప్రస్తుత ఆదాయం, సాధారణ ఖర్చులు, అవసరమైన పొదుపులు, బాకీ ఉన్న అప్పులను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ ప్రణాళికను రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. పండుగ కార్యక్రమాలు, బహుమతులు, అలంకరణలు, వేడుకల కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలి. అదనంగా ఈ బాధ్యతలను నెరవేర్చడంలో జోక్యం చేసుకోకుండా సెలవు ఖర్చులను నిరోధించడానికి ఇతర లోన్ చెల్లింపుల కోసం నిధులను కేటాయించాలని గుర్తుంచుకోవాలి.

లోన్ చెల్లింపు

మీ పండుగ సీజన్ ఖర్చులను ప్లాన్ చేసే ముందు మీ లోన్ చెల్లింపులు సకాలంలో ఉండేలా చూసుకోవాలి. ఆలస్యంగా చెల్లింపులు చేస్తే మీ రుణాన్ని పెంచే ఫెనాల్టీలు ఉంటాయి. వడ్డీ వ్యయాలను తగ్గించడానికి, లోన్ టర్మ్‌ను తగ్గించడానికి ప్రిన్సిపల్‌కి అదనపు చెల్లింపులు చేయడం ఉత్తమం. 

ఖర్చుల అంచనా

మన సంపాదనకు అనుగుణంగా ప్రతి నెలా మన ఖర్చులు ఉంటాయి. ఇలాంటి సమయంలో పండుగ ఖర్చులు అదనంగా వస్తాయి. కాబట్టి ఆ ఖర్చులను తట్టుకునేలా మన సంపాదన ఉందో? లేదో? తనిఖీ చేయాలి. ముఖ్యంగా అనవసర ఆర్భాటాలకు పోయి అధికంగా ఖర్చు చేయడం తగ్గించుకోవాలి. 

ఇవి కూడా చదవండి

ప్లానింగ్

మీ పండుగ ఖర్చులను ముందుగానే ప్లాన్ చేసుకోండి. షాపింగ్ జాబితాను రూపొందించాలి. మీ ఖర్చును పరిమితం చేసి, మిగిలిన డబ్బు మీ లోన్‌పై పాక్షికంగా ముందస్తు చెల్లింపును చేస్తే గణనీయమైన లాభం ఉంటుంది. మీరు షాపింగ్ ప్రారంభించే ముందు స్పష్టమైన వ్యయ పరిమితిని సెట్ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. 

క్రెడిట్ పరిమితి

ముఖ్యంగా షాపింగ్‌ను ఆస్వాదించే యువ తరంలో క్రెడిట్ కార్డ్‌ల వాడకం పెరిగింది. అయితే క్రెడిట్ కార్డ్‌లతో ఎక్కువ ఖర్చు చేయడం వల్ల కలిగే నష్టాలు అధికంగా ఉంటాయి. ఖర్చు చేశాక వడ్డీ ఛార్జీలను నివారించడానికి మీరు ప్రతి నెలా పూర్తి బ్యాలెన్స్‌ను చెల్లించాలి. కాబట్టి తిరిగి చెల్లించే సామర్థ్యం ఉంటేనే క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి