Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: ఎక్స్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఎలన్ మస్క్.. వారికి ఉద్వాసన

ఎలాన్‌ మస్క్, తన సొంత కంపెనీ X సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోని ఇంజినీరింగ్‌ విభాగం ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.

Elon Musk: ఎక్స్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఎలన్ మస్క్.. వారికి ఉద్వాసన
Images (1)
Follow us
Narsimha

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 05, 2024 | 3:38 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం డొనాల్డ్ ట్రంప్‌ కు మద్దతు తెలుపుతూ ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్న బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్, తన సొంత కంపెనీ X సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఉద్యోగులను తొలగించి వారికి షాక్ ఇచ్చాడు. ఎక్స్‌లోని ఇంజినీరింగ్‌ విభాగం ఉద్యోగులను తొలగించినట్లు ది వెర్జ్‌లోని ఒక నివేదిక తెలిపింది. అయితే ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నది ఇంకా స్పష్టత రాలేదని సదరు నివేదిక తెలిపింది.

రెండు నెలల క్రితం కంపెనీకి సంబంధించి వారు ఏం చేశారో తెలియజేసే విధంగా ఓ పేజీ నివేదిక ఇవ్వాలని ఎక్స్‌ ఉద్యోగులను కోరింది. అలా కొరిన రెండు నెలలకే ఉద్యోగులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఉద్వాసన పలికినట్లు సదరు నివేదిక పేర్కొంది. ఉద్యోగులకు మెయిల్స్‌ ద్వారా లేఆఫ్స్‌ సమాచారం అందించినట్లు తెలిసింది. అయితే ఈ తాజా లేఆఫ్స్‌ఫై ఎక్స్‌ బహిరంగంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ‌కారణంగా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. విడతల వారీగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. మస్క్‌ ఆధీనంలోని మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌ తన ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది కూడా అదే కోవలోకి వస్తుంది. ఇప్పుడే కాదు మస్క్ 2022లో X (అప్పుడు Twitter )ని కొనుగోలు చేసిన సమయంలో 6,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించారు. ఇది ఆ కంపెనీలో దాదాపు 80 శాతం సిబ్బంది. కాగా మునుముందు ఎలన్ మస్క్ మరెంత మందిని తొలగిస్తారోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!