Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Defence Stock: ఆ కంపెనీలో పెట్టుబడిదారులకు రాబడి వరద.. రక్షణ రంగానికి అంత ప్రాధాన్యమా?

ప్రస్తుత రోజుల్లో యువత ఆలోచనా విధానాలు మారాయి. ముఖ్యంగా పెరిగిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో యువత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడికి ముందుకు వస్తుంది. అయితే ఇటీవల కాలంలో కొన్ని స్టాక్స్ పెట్టుబడిదారులకు నమ్మలేని లాభాలను అందిస్తున్నాయి. తాజా టెంబో గ్లోబల్ ఇండస్ట్రీస్‌లో పెట్టుబడి పెట్టిన వాళ్లకు పంట పండినట్లయ్యింది. గతంలో ఎన్నడూ చూడనంత లాభాలను అందించింది.

Defence Stock: ఆ కంపెనీలో పెట్టుబడిదారులకు రాబడి వరద.. రక్షణ రంగానికి అంత ప్రాధాన్యమా?
Follow us
Srinu

|

Updated on: Nov 05, 2024 | 3:52 PM

టెంబో గ్లోబల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ  పైప్ సపోర్ట్ సిస్టమ్స్, ఫాస్టెనర్లు, యాంకర్స్, హెచ్‌వీఏసీ, యాంటీ వైబ్రేషన్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్, కమర్షియల్, యుటిలిటీ, ఓఐఎం ఇన్‌స్టాలేషన్‌ల కోసం ఉపయోగించే మెటల్ ఉత్పత్తుల తయారు చేస్తుంది. ముఖ్యంగా ఈ కంపెనీ డక్టైల్ పైపులు, హెచ్‌డీబీ పైపులు, ఫిట్టింగ్‌లు, ఎంఎస్ ప్లేట్ల తయారీ, ఇన్‌స్టాలేషన్‌లో ప్రత్యేకత కలిగి ఉంది. ఈ కంపెనీ ఉత్పత్తులు ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్‌ల కోసం అండర్ రైటర్స్ లాబొరేటరీ ఇంక్ (యూఎస్ఏ), ఎఫ్ఎం అప్రూవల్స్ (యూఎస్ఏ) ద్వారా ధ్రువీకరించారు. అయితే ఇటీవల ఈ కంపెనీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది, 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ. 164 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గతంలో రూ. 109 కోట్లుగా ఉంది. అంటే దాదాపు సంవత్సరానికి 50 శాతం వృద్ధిని నమోదు చేసింది. నిర్వహణ లాభం దాదాపు 9 శాతం నిర్వహణ మార్జిన్‌తో రూ.15 కోట్లుగా ఉంది. నికర లాభం రూ. 5 కోట్ల లాభంతో పోలిస్తే రూ. 14 కోట్లుగా ఉంది. ఇది సంవత్సరానికి దాదాపు 180 శాతం వృద్ధిని సూచిస్తుంది. ఇదే కాలంలో నికర లాభాల మార్జిన్లు దాదాపు రెట్టింపు అయ్యాయి.

వార్షిక పనితీరును పరిశీలిస్తే ఈ కంపెనీ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.432 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 6 కోట్ల నికర లాభంతో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభం రూ. 14 కోట్ల నికర లాభంతో కలిపి రూ. 19 కోట్లుగా ఉంది. దీంతో ఈ కంపెనీ షేర్లకు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో ఒక్కో షేరుకు దాదాపు రూ.601.25 వద్ద ఉన్నాయి. ఈ కంపెనీ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.667.61 కోట్లుగా ఉంది. అదనంగా ఈ షేర్లు గత 1 సంవత్సరంలో మాత్రమే దాదాపు 170 శాతం మల్టీబ్యాగర్ రాబడిని అందించాయి.

సెప్టెంబర్ నెలలో టీజీఐఎల్ భారతదేశంలో అత్యాధునిక ఆయుధాల సామగ్రి తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి ప్రముఖ యూరోపియన్ కంపెనీతో ప్రధాన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. కొత్తగా సంతకం చేసిన ఈ ఎంఓయూ టెంబో గ్లోబల్‌కు ఒక ముఖ్యమైన మైలురాయిగా ఉంది.  ముఖ్యంగా బై-బైక్ అనేది ఈ ఒప్పందంలో కీలకమైన అంశంగా మారింది. అలాగే యూరోపియన్ కంపెనీ టెంబో గ్లోబల్ ఉత్పత్తి చేసే తుపాకీలలో గణనీయమైన భాగాన్ని కొనుగోలు చేస్తుంది. ఈ చర్య రక్షణ పరిశ్రమలో టెంబో గ్లోబల్ కంపెనీ కార్యాచరణ సామర్థ్యాలను బలపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి