Bank Interest Rate: 1 నుంచి 5 ఏళ్ల డిపాజిట్లపై ప్రైవేట్ బ్యాంకుల వడ్డీ రేట్లు ఇవే!
Bank Interest Rate: బ్యాంకుల్లో అనేక పొదుపు పథకాలు ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు అందించే బ్యాంకులు ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మెరుగైన వడ్డీ రేట్లను అందిస్తోంది..
మనిషి జీవితంలో పొదుపు అనేది చాలా ముఖ్యమైన అంశం. పొదుపు పథకాల్లో మదుపు చేయడం వల్ల సురక్షితమైన భవిష్యత్తుతోపాటు ఆర్థిక కొరత లేని జీవితాన్ని గడపవచ్చు. ప్రతి ఒక్కరూ పొదుపు తప్పనిసరి చేయాలి. ప్రజల పొదుపు కోసం అనేక పొదుపు పథకాలు అమలు చేస్తున్నారు. ఆ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. అటువంటి పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్. ఈ పథకంలో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. నవంబర్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఫైనాన్సింగ్ పథకాలకు ప్రైవేట్ బ్యాంకులు ఎంత వడ్డీ రేట్లు అందిస్తాయో వివరంగా చూద్దాం.
ప్రైవేట్ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు:
Axis బ్యాంకు
- 1 సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 6.70 శాతం వడ్డీ.
- 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7.10 శాతం వడ్డీ.
- 5 సంవత్సరాల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7 శాతం వడ్డీ.
Bandhan బ్యాంక్
- 1 సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై 8.05 శాతం వడ్డీ.
- 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7.25 శాతం వడ్డీ.
- 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 8.05 శాతం వడ్డీ.
DCP బ్యాంక్:
- 1 సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై 7.10 శాతం వడ్డీ.
- 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7.55 శాతం వడ్డీ.
- 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై 7.40 శాతం వడ్డీ.
HDFC బ్యాంక్:
- 1 సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 6.60 శాతం వడ్డీ.
- 3 సంవత్సరాల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7 శాతం వడ్డీ.
- 5 సంవత్సరాల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7 శాతం వడ్డీ.
IndusInd Bank బ్యాంక్:
- 1 సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7.75 శాతం వడ్డీ.
- 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7.25 శాతం వడ్డీ.
- 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై 7.25 శాతం వడ్డీ.
YES బ్యాంక్:
- 1 సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7.25 శాతం వడ్డీ.
- 3 సంవత్సరాల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7.25 శాతం వడ్డీ.
- 5 సంవత్సరాల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 7.25 శాతం వడ్డీ.
ఇది కూడా చదవండి: PM Kisan Scheme: భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ ప్రయోజనం పొందవచ్చా? రూల్స్ ఏంటి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి