RBI Update: రూ.2000 నోట్లపై కీలక అప్‌డేట్‌ ఇచ్చిన రిజర్వ్‌ బ్యాంక్‌!

దేశంలోని పోస్టాఫీసుల ద్వారా ప్రజలు రూ.2,000 నోట్లను ఆర్‌బీఐ కార్యాలయాలకు కూడా పంపుతున్నారు. ఈ డబ్బు వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. బ్యాంకు నోట్ల డిపాజిట్/మార్పిడి పనులు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయంలో జరుగుతున్నాయి..

RBI Update: రూ.2000 నోట్లపై కీలక అప్‌డేట్‌ ఇచ్చిన రిజర్వ్‌ బ్యాంక్‌!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 05, 2024 | 10:22 AM

రూ.2000 నోట్లు ప్రస్తుతం కనుమరుగైపోయాయి. పెద్దనోట్లను ఉపసంహరించుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత ఏడాది కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నోట్లకు సంబంధించి మరో విషయాన్ని వెల్లడించింది. రూ.2000 నోట్లలో 98.04 శాతం తిరిగి బ్యాంకులకు వచ్చాయని, కేవలం రూ.6,970 కోట్ల నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది. మే 19, 2023న రూ.2000 బ్యాంకు నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

మే 19, 2023న బ్యాంకింగ్‌ వేళలు ముగిసే సమయానికి మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చెలామణిలో ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. అక్టోబర్ 31, 2024న ట్రేడింగ్ ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న నోట్ల విలువ రూ.6,970 కోట్లుగా ఉంది. మే 19, 2023 వరకు చలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 98.04 శాతం తిరిగి వచ్చినట్లు ప్రకటనలో పేర్కొంది. ఈ నోట్లను డిపాజిట్ చేసే లేదా మార్చుకునే సదుపాయం అక్టోబర్ 7, 2023 వరకు అన్ని బ్యాంక్ శాఖలలో అందుబాటులో ఉంది. ఈ సదుపాయం ఇప్పటికీ రిజర్వ్ బ్యాంక్ 19 ఇష్యూ కార్యాలయాల్లో అందుబాటులో ఉంది.

సెంట్రల్ బ్యాంక్ రూ. 2000 బ్యాంకు నోట్లను చెలామణి నుండి తీసివేసినప్పుడు 7 అక్టోబర్ 2023 వరకు ప్రజలకు సమీపంలోని ఏదైనా బ్యాంకు శాఖలో డిపాజిట్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. దీని తరువాత ప్రజలు 19 ప్రాంతీయ కార్యాలయాలు, ఆర్బీఐ పోస్ట్‌ల ద్వారా నోట్లను మార్చుకునే సదుపాయాన్ని కల్పించారు.

ఇవీ ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం వివరాలు:

గత ఏడాది మే 19 నుండి రిజర్వ్ బ్యాంక్ 19 ప్రాంతీయ కార్యాలయాలలో కూడా రద్దు చేసిన రూ.2,000 బ్యాంక్ నోటును మార్చుకునే సదుపాయం అందుబాటులో ఉంది. అయినప్పటికీ అక్టోబర్ 9, 2023 తర్వాత ఈ కార్యాలయాల్లో నోట్ల మార్పిడికి రద్దీ పెరిగింది. అప్పటి నుంచి ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు రూ.2000 నోట్లను కూడా స్వీకరిస్తున్నారు.

దేశంలోని పోస్టాఫీసుల ద్వారా ప్రజలు రూ.2,000 నోట్లను ఆర్‌బీఐ కార్యాలయాలకు కూడా పంపుతున్నారు. ఈ డబ్బు వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. బ్యాంకు నోట్ల డిపాజిట్/మార్పిడి పనులు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయంలో జరుగుతున్నాయి. ఈ కార్యాలయాలు అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి