Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bajaj Finance: పండగ సీజన్‌లో అదరగొట్టిన బజాజ్ ఫైనాన్స్‌.. భారీగా పెరిగిన లోన్స్.. 63 లక్షల రుణాలతో..

ఈ పండుగ సీజన్‌లో బజాజ్ ఫైన్స్ తమ వ్యాపారంతో అదరగొట్టింది. కస్టమర్లకు పెద్ద ఎత్తున లోన్లు మంజూరు చేసింది. జీఎస్టీ తగ్గడంతో టీవీలు, ఏసీలు వంటి వాటిని కొనడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపగా.. బజాజ్ ఫైనాన్స్ వారికి సపోర్ట్‌గా నిలిచింది. కంపెనీ ఇచ్చిన రుణాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 27 శాతం పెరిగింది.

Bajaj Finance: పండగ సీజన్‌లో అదరగొట్టిన బజాజ్ ఫైనాన్స్‌.. భారీగా పెరిగిన లోన్స్.. 63 లక్షల రుణాలతో..
Bajaj Finance
Krishna S
|

Updated on: Nov 04, 2025 | 7:14 PM

Share

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ నాన్-బ్యాంకింగ్ రుణదాత బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ పండుగ సీజన్‌లో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ప్రజలు ఎక్కువగా వస్తువులు కొనడానికి లోన్లు తీసుకోవడంతో, కంపెనీ ఇచ్చిన రుణాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 27శాతం పెరిగింది. మొత్తం లోన్ విలువ కూడా 29 శాతం పెరిగినట్లు ప్రకటించింది. ఈ వృద్ధికి  రెండు ముఖ్య కారణాలను సంస్థ వెల్లడించింది. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన కొత్త జీఎస్టీ మార్పులతో వస్తువుల ధరలు తగ్గాయి. దీంతో సాధారణ ప్రజలు కూడా భారీగా కొనుగోళ్లు చేశారు. ధరలు తగ్గడంతో, ప్రజలు పాత మోడల్స్ కాకుండా మంచి నాణ్యత ఉన్న టీవీలు, ఏసీలు వంటి వస్తువులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు.

సగం మంది కొత్తగా తీసుకున్నవారే..

ఈసారి పండుగ సీజన్‌లో బజాజ్ ఫైనాన్స్ మొత్తం 63 లక్షల రుణాలను ఇచ్చింది. దాదాపు 23 లక్షల మంది కొత్త కస్టమర్లు చేరారు. వీరిలో సగానికి పైగాతమ జీవితంలో మొట్టమొదటిసారిగా లోన్ తీసుకున్నవారు కావడం విశేషం. బజాజ్ ఫైనాన్స్ చైర్మన్ సంజీవ్ బజాజ్ మాట్లాడుతూ.. “ప్రభుత్వ సంస్కరణల వల్ల మధ్యతరగతి కుటుంబాలు కూడా పండుగ సమయంలో ధైర్యంగా ఖర్చు చేయగలిగారు. సగం మంది కొత్త కస్టమర్లు లోన్ తీసుకోవడం అనేది ఆర్థిక వ్యవస్థ బలం పెరగడానికి నిదర్శనం” అని చెప్పారు.

టీవీల కొనుగోళ్లలో మార్పు

టీవీలు, ఏసీలపై జీఎస్టీ తగ్గడంతో కస్టమర్లు తమ లోన్ మొత్తాన్ని 6శాతం తగ్గించుకుంటూనే.. పెద్ద సైజు టీవీలు కొన్నారు. బజాజ్ ఫైనాన్స్ ఇచ్చిన లోన్లలో 71శాతం ఈ పెద్ద టీవీలే ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ ఈ విధంగా టెక్నాలజీని ఉపయోగించి ఎక్కువ మందికి అప్పులు అందుబాటులోకి తెస్తూ ఆర్థికంగా సహాయపడుతోంది.

బజాజ్ ఫైనాన్స్ గురించి..

బజాజ్ ఫైనాన్స్ అనేది RBI కింద నమోదు చేయబడిన ఒక డిపాజిట్ తీసుకునే (FDలను సేకరించే) నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC). మంచి పనితీరు కారణంగా దీనికి CRISIL AAA/స్టేబుల్ వంటి అత్యధిక రేటింగ్‌లు ఉన్నాయి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, ఫర్నిచర్ మరియు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లు వంటి వాటికి సులభంగా లోన్లు ఇస్తారు. వీరు తమ యాప్ ద్వారా 11 కోట్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తున్నారు. ఈ యాప్‌ను 75.1 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా కస్టమర్‌లు లోన్లు, డిపాజిట్లు, బీమా, పెట్టుబడులను సులభంగా మరియు వేగంగా పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి