Ceiling Fans: ఫ్యాన్ కొనాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి.. ఈ కొత్త రూల్స్ తెలుసుకోకపోతే ఇబ్బందే..
రానున్న వేసవి దృష్ట్యా వీటి కొనుగోళ్లు భారీగా ఉండే అవకాశం ఉంది. అందుకే సీలింగ్ ఫ్యాన్ల తయారీ, విక్రయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇవి 2024 ఫిబ్రవరి నుంచి అమలులోకి వస్తాయి. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వినియోగదారులకు అందించారు. తన ఎక్స్(ట్విట్టర్)ఖాతాలో ఇందుకు సంబంధించిన సమాచారంతో కూడిన వీడియోను షేర్ చేశారు.

సీలింగ్ ఫ్యాన్ అనేది ప్రతి ఇంటికీ అవసరం. ఎన్ని ఏసీలు, కూలర్లు ఉన్నా.. పైనా సీలింగ్ కు మాత్రం ఓ ఫ్యాన్ తప్పనిసరి. ఇది ఏళ్ల పాటు కొనసాగాల్సి ఉంటుంది. అందుకే మన్నిక, నాణ్యత, అందం కలిగిన సీలింగ్ ఫ్యాన్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ప్రయత్నిస్తుంటారు. అలాంటి సీలింగ్ ఫ్యాన్ కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రస్తుతం శీతాకాలం కాబట్టి వీటి వినియోగం కాస్త తక్కువే అయినా.. రానున్న వేసవి దృష్ట్యా వీటి కొనుగోళ్లు భారీగా ఉండే అవకాశం ఉంది. అందుకే సీలింగ్ ఫ్యాన్ల తయారీ, విక్రయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇవి 2024 ఫిబ్రవరి నుంచి అమలులోకి వస్తాయి. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వినియోగదారులకు అందించారు. తన ఎక్స్(ట్విట్టర్)ఖాతాలో ఇందుకు సంబంధించిన సమాచారంతో కూడిన వీడియోను షేర్ చేశారు. సీలింగ్ ఫ్యాన్ కొనుగోలు చేసే సమయంలో ప్రతి ఒక్కరూ కొన్ని అంశాలను తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..
వీడియోలో ఏముందంటే..
2023, నవంబర్ 24 శుక్రవారం వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో ఒక వీడియోను పోస్ట్ చేసారు. వచ్చే ఏడాది నుంచి సీలింగ్ ఫ్యాన్లను కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వినియోగదారులను హెచ్చరించారు. వినియోగదారుల ప్రయోజనాల కోసం మంత్రిత్వ శాఖ కఠినమైన భద్రతా నియమాలను అమలు చేస్తోందని చెబుతూ.. సీలింగ్ ఫ్యాన్‌లకు సంబంధించిన నిబంధనలలో గణనీయమైన మార్పులను మంత్రి హైలైట్ చేశారు. కొనుగోలు చేసే ముందు ఫ్యాన్‌లపై ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూషన్ మార్క్(ఐఎస్‌ఐ) గుర్తు ఉందో లేదో తనిఖీ చేయాలని ఆయన వినియోగదారులను కోరారు.
Ceiling Fan पर ISI मार्क होने से ऐसे मिलेगा उपभोक्ताओं को लाभ… pic.twitter.com/l45oRC4wzb
— Piyush Goyal (@PiyushGoyal) November 24, 2023
ఫిబ్రవరి 2024 నుండి, విక్రయించే అన్ని సీలింగ్ ఫ్యాన్‌లు తప్పనిసరిగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఐఎస్ఐ గుర్తును కలిగి ఉండాలని పేర్కొంటూ, ఫ్యాన్ తయారీదారులందరికీ నాణ్యత నియంత్రణ ఆర్డర్‌లను జారీ చేశామని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐఎస్ఐ గుర్తు లేని ఉత్పత్తులు అమ్మకం, నిల్వ లేదా ఎగుమతి చేయడానికి ఇకపై అనుమతులు ఉండవు.
పాటించకపోతే కఠిన చర్యలు..
ఈ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. మొదటిసారి ఉల్లంఘించిన వారికి రూ. 2 లక్షల జరిమానా, 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తామని ప్రకటించింది. అదే మరోసారి పునరావృతం చేసే వారికి రూ. 5 లక్షల జరిమానా లేదా ఉత్పత్తి విలువ కంటే 10 రెట్ల వరకు రికవరీ విధిస్తామని పేర్కొంది. ఈ చొరవ వినియోగదారుల భద్రతను మాత్రమే కాకుండా స్థానిక చిన్న సంస్థల అభివృద్ధికి మద్దతు ఇస్తుందని వివరించింది.
నాణ్యతకు పెద్ద పీట..
కొత్త నిబంధనలు సీలింగ్ ఫ్యాన్‌ల కోసం భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నందున, చట్టపరమైన పరిణామాలను నివారించడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఉండే ఫ్యాన్‌ల కొనుగోలుకు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పీయూష్ గోయల్ పోస్ట్ చేసిన వీడియోలో ఈ చర్య సీలింగ్ ఫ్యాన్‌లు మంచి నాణ్యతతో ఉన్నాయని నిర్ధారిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..