Jio Air Fiber: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. 45 నగరాల్లో జియో ఎయిర్ ఫైబర్ సేవలు
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ మొబైల్ డేటా నెట్‌వర్క్ అయిన రిలయన్స్ జియో, ప్రపంచ స్థాయి సరికొత్త హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, స్మార్ట్ హోమ్ సేవలు, హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కు సంబంధించితన ఇంటిగ్రేటెడ్ ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్ అయిన జియోఎయిర్‌ఫైబర్ సేవలను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు జియో ప్రకటించింది. అంచెలంచెలుగా సవాళ్లను అధిగమిస్తూ జియో ఫైబర్‌ను మరింతగా విస్తరిస్తున్నట్లు తెలిపింది. హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌కు యాక్సెస్ లేని ప్రతి ఇల్లు..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ మొబైల్ డేటా నెట్‌వర్క్ అయిన రిలయన్స్ జియో, ప్రపంచ స్థాయి సరికొత్త హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, స్మార్ట్ హోమ్ సేవలు, హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కు సంబంధించితన ఇంటిగ్రేటెడ్ ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్ అయిన జియోఎయిర్‌ఫైబర్ సేవలను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు జియో ప్రకటించింది. అంచెలంచెలుగా సవాళ్లను అధిగమిస్తూ జియో ఫైబర్‌ను మరింతగా విస్తరిస్తున్నట్లు తెలిపింది. హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌కు యాక్సెస్ లేని ప్రతి ఇల్లు, చిన్న వ్యాపార సంస్థనూ సైతం అనుసంధానం చేసేందుకు జియో తన పనులను వేగవంతం చేస్తోంది. జియోఎయిర్ ఫైబర్ సేవలు ఇప్పుడు ఏపీలోని 45 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నగరాల్లోని అన్ని ఇళ్లు, వ్యాపార సంస్థలు ఇప్పుడు ప్రపంచ స్థాయి తాజా హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ అనుభవాన్ని ఒకే ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ద్వారా పొందవచ్చు. ఈ సందర్బంగా జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. జియో ఎయిర్‌ఫైబర్ సేవలు ఏపీ వ్యాప్తంగా విస్తరిస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఇళ్లు, వ్యాపార సంస్థలు ప్రపంచ స్థాయి తాజా హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ అనుభవాన్ని ఒకే ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ద్వారా పొందగలుగుతాయని అన్నారు. ఈ మైలురాయి ఈ ప్రాంత డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌కు గణనీయమైన మెరుగుదలని సూచిస్తుందని అన్నారు. ఏపీలో జియోఎయిర్‌ఫైబర్ సేవల విస్తరణ రాష్ట్ర యువతకు అత్యాధునిక కనెక్టివిటీ పరిష్కారాలను అందించడానికి జియో నిబద్ధతను మరింత పటిష్టం చేస్తుందని అన్నారు.
జియోఎయిర్‌ఫైబర్ టీవీ లేదా బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ప్రపంచ స్థాయి తాజా హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ అనుభవానికి అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాన్ని అందిస్తుంది. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ద్వారా అందించడం జరుగుతుందన్నారు. జియోఎయిర్‌ఫైబర్ ప్లాన్స్ రూ. 599కి 30 Mbps వేగంతో అపరిమిత డేటాను, రూ. 899, రూ. 1199కి 100 Mbps స్పీడ్ ప్లాన్‌లను అందిస్తాయి. ఈ ప్లాన్‌లన్నీ 550+ డిజిటల్ టీవీ ఛానెల్‌లు, ప్రముఖ ఓటీటీయాప్‌లకు సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తాయి. 14ప్రముఖ ఓటీటీప్లాట్‌ఫామ్‌లు రూ. 599, రూ. 899 ప్లాన్‌లతో అందుబాటులో ఉన్నాయి. అలాగే రూ. 1199 ప్లాన్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియంతో సహా 16+ ప్రముఖ OTT యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుందని జియో వెల్లడించింది. కొత్త కనెక్షన్ల కోస 60008-60008 నంబర్‌కు కాల్ చేయవచ్చని, లేదా www.jio.comకు లాగిన్ అయి కూడా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చుని తెలిపింది. జియో ఎయిర్ ఫైబర్ అనేది జియో ఫైబర్ మాదిరిగానే అత్యుత్తమ సేవలను అందిస్తుందన్నారు.
1. డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్
☛ అన్ని ప్రముఖ 550+ డిజిటల్ టీవీ ఛానెల్‌లు: మీకు ఇష్టమైన అన్ని టీవీ ఛానెల్‌లు హై-డెఫినిషన్‌లో అందుబాటులో ఉన్నాయి.
☛ క్యాచ్-అప్ టీవీ: వినియోగదారులు ఇప్పుడు వారికి ఇష్టమైన షోలను చూడవచ్చు.
☛ అత్యంత ప్రజాదరణ పొందిన 16+ OTT యాప్‌లు: జియోఎయిర్‌ఫైబర్వినియోగదారులు ప్రముఖ ఓటీటీ యాప్‌లకు ఉచిత సదుపాయం పొందవచ్చు. వినియోగదారులు ఈ సబ్‌స్క్రిప్షన్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు. టీవీ ల్యాప్‌టాప్, మొబైల్ లేదా టాబ్లెట్ వంటి వారికి నచ్చిన ఏదైనా పరికరంలో యాప్‌లను ఉపయోగించవచ్చు.
2. బ్రాడ్‌బ్యాండ్
☛ ఇండోర్ వైఫై సర్వీస్: జియో విశ్వసనీయ వైఫైకనెక్టివిటీ, మీ ఇల్లు లేదా వ్యాపార ప్రాంగణంలో ప్రతి మూలలో హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ అనుభవం.
3. స్మార్ట్ హోమ్ సేవ
☛ విద్యార్థుల కోసం, ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం క్లౌడ్ PC
☛ ఆరోగ్య సంరక్షణ
☛ చదువు
☛ స్మార్ట్ హోమ్ IOT
☛ గేమింగ్
☛ హోమ్ నెట్‌వర్కింగ్
4. అదనపు ఖర్చు లేకుండా గృహ పరికరాలు:
☛ మీ ఇల్లు లేదా వ్యాపార ప్రాంగణంలో కవరేజ్ కోసం వైఫైరూటర్
☛ 4k స్మార్ట్ సెట్ టాప్ బాక్స్
☛ వాయిస్-యాక్టివ్ రిమోట్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి