Women Astrology: తులా రాశిలో శుక్రుడు.. ఆ రాశులకు చెందిన మహిళలకు మహాయోగం
Shukra Gochar in Thula Rashi: శుక్రుడు తులా రాశిలో సంచారం చేయడంతో, మేషం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభ రాశులకు చెందిన మహిళలకు అద్భుత మహాయోగం పట్టనుంది. వృత్తి, ఆర్థిక, కుటుంబ జీవితాల్లో శుభ ఫలితాలు లభిస్తాయి. వివాహం, ఉద్యోగంలో పదోన్నతులు, ధన లాభం, సంతానం వంటి రాజయోగాలు సాధ్యమవుతాయి. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు అపారమైన విజయాలు సాధించగలరు.

Women Astrology
జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడు స్త్రీగ్రహం. ఈ శుక్రుడికి ఎప్పుడు, ఏ విధంగా బలం కలిగినా మహిళలకు ఎక్కువగా శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంటుంది. నవంబర్ 3 నుంచి 26 వరకు శుక్రుడు తన స్వస్థానమైన తులా రాశిలో సంచారం చేస్తున్నందువల్ల కొద్ది రోజుల పాటు కొన్ని రాశులకు చెందిన మహిళామణులకు రాజయోగాలు పట్టబోతున్నాయి. శుక్రుడు మహిళలకు అత్యధికంగా మేలు చేయడం జరుగుతుంది. మేషం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభ రాశులకు చెందిన మహిళలకు విపరీత రాజయోగం, మహా భాగ్య యోగం వంటివి పట్టే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్ర సంచారం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.బాగా అనుకూలమైన వ్యక్తితో ప్రేమలో పడే సూచనలు కూడా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అత్యధికంగా లాభాలు పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పిల్లలు బాగా రాణిస్తారు. సంతాన యోగం కలుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యానికి భంగమేమీ ఉండదు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది.
- కన్య: ఈ రాశికి ధన స్థానంలో ధనాధిపతి శుక్రుడి సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. పుట్టింటి నుంచి ఆస్తి లభిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక సమస్యల నుంచే కాక, వ్యక్తిగత సమస్యల నుంచి కూడా చాలావరకు బయటపడతారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. మంచి ఉద్యోగంలో చేరే సూచనలున్నాయి. ఆశించిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.
- తుల: రాశ్యధిపతి శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశికి చెందిన మహిళలకు తప్ప కుండా రాజ యోగాలు పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పదోన్నతులు కలుగుతాయి. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. వ్యక్తిగత, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు.
- మకరం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర సంచారం జరుగుతున్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం కలుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఇష్టమైన వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది.
- కుంభం: ఈ రాశికి బాగ్యాధిపతి అయిన శుక్రుడు భాగ్య స్థానంలో సంచారం చేయడం వల్ల నిరుద్యోగ మహిళలకు విదేశీ ఆఫర్లు ఎక్కువగా అందుతాయి. ఉద్యోగంలో తప్పకుండా అధికారయోగం పడుతుంది. సంతాన యోగం కలుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. కుటుంబ, దాంపత్య జీవితాల్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఇవి కూడా చదవండి







