కార్తీక పౌర్ణమితో ఈ రాశులకు దశ తిరిగినట్టే..! రాజయోగాలు, ధన యోగాలు ఖాయం
Kartika Purnima 2025:నవంబర్ 5న కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడే గజకేసరి యోగం వల్ల మేషం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశుల వారికి అద్భుతమైన రాజయోగాలు, ధన యోగాలు ప్రాప్తించనున్నాయి. చంద్రుని బలం పెరగడంతో పాటు గురువుతో కలిసే ఈ యోగం ఆర్థిక, వృత్తిపరమైన లాభాలు, శుభకార్యాలు, ఉన్నత స్థితిని తెస్తుంది. ఈ ప్రత్యేక యోగంతో వారి జీవితాలు వెలుగులీనే అవకాశం ఉంది.

Kartika Purnima 2025
నవంబర్ 5న రాబోతున్న కార్తీక పౌర్ణమి నుంచి కొన్ని రాశుల వారి జీవితాలు ఉచ్ఛ స్థితికి చేరుకోబోతున్నాయి. మనస్సుకు కారకుడైన చంద్రుడికి ఆ రోజున అన్ని విధాలుగానూ బలం కలగడంతో పాటు, ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో గజకేసరి యోగం కూడా కలుగుతున్నందు వల్ల కొన్ని రాశుల వారి జీవితాలు కొద్ది ప్రయత్నంతో ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ కార్తీక పౌర్ణమికి ఒక ప్రత్యేకత, విశిష్టత ఏర్పడుతున్నాయి. మేషం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశుల వారు రాజయోగాలు, ధన యోగాలు అనుభవించడం జరుగుతుంది. ఈ రాశుల వారు ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది.
- మేషం: ఈ రాశిలో ఉన్న చంద్రుడికి పౌర్ణమి, గజకేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల బలం బాగా పెరుగుతోంది. దీనివల్ల ఈ రాశివారి మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుబోతున్నాయి. ఈ రాశివారు కొద్దిగా ప్రయత్నించినా అత్యధికంగా లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి. ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
- మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న చంద్రుడికి పౌర్ణమి, గజకేసరి యోగం కారణంగా బలం పెరుగుతు న్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
- కర్కాటకం: రాశ్యదిపతి చంద్రుడికి దశమ స్థానంలో పౌర్ణమి వల్ల, గజకేసరి యోగం వల్ల బలం పెరుగుతు న్నందువల్ల ఈ రాశివారు తప్పకుండా అందలాలు ఎక్కే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడంతో పాటు జీతభత్యాలు కూడా బాగా పెరుగుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది.
- తుల: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న చంద్రుడికి బలం పెరగడం వల్ల ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదరడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. విదేశీ ఆఫర్లు అందే అవకాశం కూడా ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారి ఆశలు నెరవేరుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
- మకరం: ఈ రాశికి చతుర్థ స్థానంలో పౌర్ణమి, గజకేసరి యోగం చోటు చేసుకుంటున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది.
- మీనం: ఈ రాశికి ధన స్థానంలో చంద్రుడికి బలం పెరుగుతున్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు చాలావరకు తొలగిపోతాయి. ఉద్యో గంలో అధికారులకు మీ సలహాలు, సూచనలు లబ్ధిని చేకూరుస్తాయి. మాటకు విలువ పెరుగుతుంది. జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొద్ది ప్రయత్నంతో అభివృద్ది బాటపడతాయి. రావలసిన సొమ్ము, రాదనుకుని వదిలేసుకున్న సొమ్ము తప్పకుండా చేతికి అందుతాయి.



