- Telugu News Photo Gallery Spiritual photos Trigrahi Yoga brings financial benefits to three zodiac signs
త్రిగ్రాహి యోగం.. వీరికి అనుకోని ధనలాభం!
జ్యోతిష్యశాస్త్రంలో యోగాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది, గ్రహాల కలయిక వలన యోగాలు ఏర్పడుతుంటాయి. అయితే నవంబర్ నెలలో మూడు రాశులు ఒకే రాశిలో కలయిక జరపనున్నాయి. దీంతో అద్భుతమైన త్రిగ్రాహి రాజయోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశులపై ప్రభావం చూపుతూ అద్భుతమైన ప్రయోజనాలను అందించనున్నది.
Updated on: Oct 31, 2025 | 3:23 PM

నవంబర్ నెలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో కార్తీక పౌర్ణమి కూడా వస్తుంది. అంతే కాకుండా తులసి వివాహం కూడా నవంబర్ 2వ తేదీన జరగనుంది. అయితే ఆధ్యాత్మిక పరంగా ఈ నవంబర్ నెలకు చాలా ప్రత్యేకత ఉండనుంది. అయితే ఈ మాసంలోనే మూడు గ్రహాలు ఒకే రాశిలోకి రానున్నాయి.

వృశ్చిక రాశిలో, కుజ గ్రహం, సంపదకు చిహ్నం అయిన శుక్రగ్రహం, గ్రహాలకు రాజు అయినటువంటి సూర్య గ్రహం, ఈ మూడు ఒకే రాశిలో కలవనున్నాయి. దీంతో ఇది 12 రాశులపై దాని ప్రభావం చూపగా, మూడు రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఇంతకీ అవి ఏ రాశులు అంటే?

వృశ్చి క రాశి : మూడు గ్రహాలు ఇదే రాశిలో కలవడం వలన వృశ్చిక రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. అనుకోని విధంగా డబ్బు చేతికందుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. అన్నింట శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి : మకర రాశి వారికి మూడు గ్రహాల కలయిక, వలన సంపద పెరుగుతుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. ధనలాభం కలిగే అవకాశం ఉంది. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది.

మీన రాశి : మీన రాశి వారికి వ్యాపారంలో అత్యధిక లాభాలు వస్తాయి. ఎవరైతే రియలెస్టేట్ రంగంలో ఉన్నారో, వారికి పట్టిందల్లా బంగారమే అని చెప్పాలి. అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. ఈ రాశి వారు ఈ మాసం మొత్తం చాలా ఆనందంగా గడుపుతారు.



