Luck and Wealth: ఈ రాశుల వారికి మహాభాగ్య యోగం.. శుభాలు, సంపదలు పక్కా..!
నవంబర్ 7-9 తేదీల్లో వృషభంలో చంద్రుడు ఉచ్ఛ స్థితిలోకి రావడం, కుజుడితో చంద్ర మంగళ యోగం ఏర్పడటం ఐదు రాశులకు అదృష్టాన్ని తెస్తుంది. మేషం, వృషభం, కర్కాటకం, వృశ్చికం, మకర రాశుల వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయి, ధన లాభాలు కలుగుతాయి. ఈ మూడు రోజుల్లో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు, ప్రయత్నాలు శుభ ఫలితాలనిస్తాయి, అంచనాలకు మించి విజయాలు సాధిస్తారు.

Wealth And Luck Astrology
నవంబర్ 7, 8, 9 తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలో ఉచ్ఛ స్థితిలోకి రావడం జరుగుతోంది. చంద్రుడు ఉచ్ఛ స్థితి పట్టినప్పుడల్లా కొన్ని రాశులకు తప్పకుండా మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఈసారి ఈ ఉచ్ఛ చంద్రుడికి సప్తమంలో, స్వస్థానంలో సంచారం చేస్తున్న కుజుడితో సమ సప్తక దృష్టి ఏర్పడింది. చంద్ర, కుజులు పరస్పరం చూసుకోవడం వల్ల చంద్ర మంగళ యోగమనే మహాభాగ్య యోగం ఏర్పడుతుంది. ఫలితంగా మేషం, వృషభం, కర్కాటకం, వృశ్చికం, మకర రాశులకు ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలిగే అవకాశాలున్నాయి. ఈ మూడు రోజుల్లో తీసుకునే ఆర్థిక సంబంధమైన నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాలు ఆశించిన శుభ ఫలితాలనిస్తాయి.
- మేషం: ఈ రాశికి ధన స్థానంలో చంద్రుడు ఉచ్ఛపట్టడం, రాశ్యధిపతి కుజుడితో సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆస్తిపాస్తులు, ఆదాయ వృద్ధికి సంబంధించి ఈ రాశివారి మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు రాబడి బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. సంపన్న వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.
- వృషభం: ఈ రాశిలో ఉచ్ఛ పట్టిన చంద్రుడికి కుజుడితో సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల ప్రముఖులతో లాభ దాయక సంబంధాలు వృద్ధి చెందడంతో పాటు ఒకటికి రెండుసార్లు ధనయోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదరడం, ప్రేమలో పడడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందే అవకాశం ఉంది.
- కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడం ఒక విశేషం కాగా, ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడితో పరస్పర వీక్షణ కలగడం మరో విశేషం. ఈ రెండు పరిణామాల కారణంగా ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ధన ధాన్య సమృద్ధి యోగం కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధిచెంది సంపన్నుడవుతారు. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి.
- వృశ్చికం: రాశినాథుడు కుజుడికి, ఉచ్ఛ చంద్రుడికి సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవ కాశం కూడా కలుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదరడం లేదా ప్రేమలో పడ డం జరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదా యం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు బాగా విస్తరించే అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశికి లాభస్థానంలో ఉన్న కుజుడితో పంచమ స్థానంలోని ఉచ్ఛ చంద్రుడికి పరస్పర దృష్టి ఏర్పడడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఉంది.



