AP News: బాబు అరెస్ట్‌తో మారిన ఏపీ రాజకీయాలు.. బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో
చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. నిరసనలు, ఆందోళనలు, బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ దీనిని సానుభూతిగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందంటూ అచ్చెన్నాయుడు, యనమల వంటి సీనియర్లు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి భయంతోనే చంద్రబాబును అరెస్టు చేశారంటున్నారు. జనసేతో కలిసి టీడీపీ...

చంద్రబాబు అరెస్టుపై టీడీపీ, వైసీపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. తాజా పరిణామాలతో సమీకరణాలు కూడా వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలే లక్ష్యంగా అరెస్టు అనంతరం లాభనష్టాలపై లెక్కలేసుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. సానుభూతి లెక్కల్లో తెలుగుదేశం ఉంటే.. ప్రజల్లో చంద్రబాబు అవినీతికి ఎండగట్టామంటోంది వైసీపీ. అరెస్టు వ్యవహారంతో టీడీపీ- జనసేన మధ్య బంధం మరింత బలపడిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. నిరసనలు, ఆందోళనలు, బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ దీనిని సానుభూతిగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందంటూ అచ్చెన్నాయుడు, యనమల వంటి సీనియర్లు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి భయంతోనే చంద్రబాబును అరెస్టు చేశారంటున్నారు. జనసేతో కలిసి టీడీపీ పోటీచేస్తే వైసీపీ అడ్రస్ గల్లంతేనని.. ఆ భయమే కనిపించిందన్నారు అచ్చెన్నాయుడు. ఇక వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెప్పిన తర్వాతే వైసీపీ ఆందోళనతో అరెస్టులు, యాత్రలు అడ్డుకుంటూ కొత్త కొత్త డ్రామాలకు తెరతీసిందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
స్కీములో చేసిన స్కాములను చూసే అరెస్టు చేస్తారు తప్ప రాజకీయకోణాలు లేవంటోంది వైసీపీ. జనసేన పక్కన లేకపోతే అడుగు తీసి అడుగువేయలేని టీడీపీని చూసి భయపడాల్సిన అవసరం తమకు లేదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మొత్తానికి ఈ వ్యవహారంలో టీడీపీ కోరుకుంటున్నట్టు సానుభూతిగా మారుతుందా? లేదంటే అవినీతి అక్రమాలు బయటపెట్టిన ఘనత వైసీపీకి దక్కుతుందా? సమీప భవిష్యత్తులోనే ఎన్నికలు ఉండటంతో రాజకీయంగా లాభ నష్టాలపై లెక్కలు వేసుకోవడం సహజం. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.
ఇదే అంశంపై టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..







