AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై మరో కేసు నమోదు.. ఈసారి ఎందుకంటే..

ఇటీవల పార్టీకి రెబల్ గా మారడం. పార్టీ నుంచి బయటకు వచ్చి తెలుగు దేశం పార్టీలో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మరో కేసు నమోదైంది.. చంద్రబాబు అరెస్టు పరిణామాల్లో గత మూడు రోజులుగా టీడీపీ నేతల గృహ నిర్బందాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా స్థానిక సిఐ సుబ్బారావు తన సిబ్బందితో కలిసి కోటంరెడ్డి నివాసానికి వెళ్లారు.. అక్కడ ఉన్న క్యాడర్ ని వెళ్లాలని సూచించారు.. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి కలుగజేసుకుని సిఐపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎలా నా ఇంటికి వస్తావని ముందు బయటకు పో అని అందరి ముందు గర్జించారు

AP Politics: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై మరో కేసు నమోదు.. ఈసారి ఎందుకంటే..
MLA Kotam Reddy
Ch Murali
| Edited By: |

Updated on: Sep 11, 2023 | 8:25 PM

Share

నెల్లూరు, సెప్టెంబర్ 11: నెల్లూరులో జిల్లాలోనే అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేల్లో టాప్ లో ఉంటారు ఆ ఎమ్మెల్యే.. అతనెవరో కాదు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గతంలో అనేక కేసులు కోటంరెడ్డిపై నమోదయ్యాయి.. తాజాగా మరో కేసును పోలీసులు నమోదు చేశారు. అదేంటో చూద్దాం.. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. వివాదాలు కోటంరెడ్డి పక్కపక్కనే ఉంటారు.

2014 లో టిడిపి అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మాఫియా కేసు బ్లాస్ట్ అయ్యింది. కింగ్ పిన్ కృష్ణసింగ్ తో సంబంధాలు ఉన్న జాబితాలో అప్పట్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు ఉండడం సంచలనం కలిగించింది.. దీంతో పోలీసులు విచారణకు పిలవగా పోలీసు ఉన్నతాధికారులనే టార్గెట్ చేస్తూ విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు కోటంరెడ్డి. ఇక 2019 ఎన్నికల ముందు తన ఫిర్యాదును పట్టించుకోలేదన్న కారణంగా వేదయపాలెం పీఎస్ కు వెళ్లి సిఐ పై దురుసుగా ప్రవర్తించడం అప్పట్లో వివాదాస్పదమైంది.

అధికార పార్టీలో ఉన్నా..

అప్పటిదాకా ప్రతిపక్ష ఎమ్మెల్యే. ఇక 2019లో ఎన్నికలు జరిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరు మరింత వివాదాలకు కేంద్రంగా మారింది. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం ఎంపిడివో సరళ ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేశారంటూ కేసు నమోదైంది. దీంతో అధికార పార్టీలో ఉన్నా అప్పటి పరిణామాల్లో అరెస్టు తప్పలేదు. అలాగే పార్టీ అధికారంలోకి రాగానే ప్రతిపక్ష పార్టీ నేతలపై ప్రతీకార దాడులకు పాల్పడిన కారణంగే అనేక కేసులు నమోదయ్యాయి.

ముందు బయటకు పో..

అవన్నీ అప్పట్లో పెద్దగా ఫోర్స్ లో లేవు.. ఇటీవల పార్టీకి రెబల్ గా మారడం. పార్టీ నుంచి బయటకు వచ్చి తెలుగు దేశం పార్టీలో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మరో కేసు నమోదైంది.. చంద్రబాబు అరెస్టు పరిణామాల్లో గత మూడు రోజులుగా టీడీపీ నేతల గృహ నిర్బందాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా స్థానిక సిఐ సుబ్బారావు తన సిబ్బందితో కలిసి కోటంరెడ్డి నివాసానికి వెళ్లారు..

అక్కడ ఉన్న క్యాడర్ ని వెళ్లాలని సూచించారు.. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి కలుగజేసుకుని సిఐపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎలా నా ఇంటికి వస్తావని ముందు బయటకు పో అని అందరి ముందు గర్జించారు. ఈ విషయం వైరల్ గా మారింది. పోలీసు సిబ్బంది పిర్యాదు మేరకు ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కేసు నమోదు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి