Vijayasai Reddy: తొలిరోజు సమీక్ష ముగిసింది.. రెండో రోజు అసలు పరీక్ష.. విజయసాయిరెడ్డితో ఎవరెవరికి క్లాస్ పడిందంటే..
తొలిరోజు సమీక్ష ముగిసింది.. రెండో రోజు అసలు పరీక్ష మిగిలింది. ఒంగోలులో వైసిపి రీజనల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి బిజీ బిజీగా వైసిపి నేతలతో సమావేశాలు నిర్వహిస్తు్నారు. తొలిరోజు మంత్రి, ఎంపి, ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఎవరెవరికి క్లాసులు పడ్డాయో... ఎవరి గురించి ఏం మాట్లాడారో.. అన్న చర్చ ప్రకాశంజిల్లాలోని వైసిపి నేతల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇక రేపు రెండోరోజు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు... ఒక్క ఒంగోలు మినహా జిల్లాలోని మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు అసంతృప్త నేతల బెడద ఎక్కువగా ఉండటంతో వీరందరిని ఎలా సమన్వయం చేస్తారోనన్న ఆశక్తికర చర్చలు సాగుతున్నాయి...

ప్రకాశంజిల్లా, సెప్టెంబర్ 11: ప్రకాశంజిల్లా నేతలకు దక్షిణ కోస్తా జిల్లా వైసిపి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి దిశానిర్దేశం చేశారు… రెండు రోజుల పాటు ఒంగోలులోని జ్యోతిప్లాజాలో ఉన్న ఓ హోటల్‌లో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు… ఈ సందర్బంగా ప్రకాశం జిల్లా పార్టీ సమీక్ష సమావేశంలో పార్టీ నాయకులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు.. పార్టీ సంస్థాగత నిర్మాణం, ముఖ్యమంత్రి జగన్అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం, పార్టీ నియోజకవర్గ స్థాయి వ్యవహారాలు తదితర అంశాలపై చర్చించారు.
తొలుత జిల్లాకు చెందిన ఎపి మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు… అనంతరం ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డితో విజయసాయి సుదీర్ఘంగా చర్చలు జరిపారు… ప్రకాశం జిల్లాలో పార్టీ బలంగా ఉందని, జిల్లాలో ఒక్క కొండపి నియోజకవర్గంలోనే పార్టీ ఓడిపోయినందున రానున్న ఎన్నికల్లో కొండపిలో కూడా పార్టీ జెండా ఎగరెయ్యాలని సూచించారు.
తెలుగు దేశం పార్టీ ఇక కోలుకోనే పరిస్ధితి లేదని, 2024 ఎన్నికల్లో వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తుందని వివరించారు… నియోజకవర్గాలలో ద్వితీయ, తృతీయ స్థాయి నాయకులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు… అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందించాల్సిన భాద్యత ఎమ్మేల్యేలు, నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీల మీద ఉందన్నారు… అలాగే నియోకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల పట్ల అసంతృప్త నేతలు చేస్తున్న ఆరోపణలపై సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని పలువురు ఎమ్మెల్యేలకు, ఇన్‌చార్జిలకు విజయసాయి సూచించారు.
వాలంటిర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహాసారథులు ఈ మూడు వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకుర్చాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీదనే ఉందని స్పష్టం చేశారు..ముఖ్యమంత్రి అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని, రాజకీయంగా పదవులను కల్పించారని తెలిపారు… దొంగ ఓటర్ల విషయంలో జగ్రత్త వహించాలని కోరారు…. చివరిగా నియోజకవర్గ స్థాయిలో ఏదైన సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, తన స్థాయిలో పరిష్కారానికి కృషి చేస్తానని లేని పక్షంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
విడివిడిగా నిర్వహించిన ఈ సమావేశాల్లో ఎపి మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డితో పాటు మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదనయాదవ్, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ , సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, మాజీ మంత్రి సిద్దా రాఘవరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి తదితరులు విజయసాయిరెడ్డితో సమావేశం అయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం




