AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Trains: సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే

Sankranthi Special Trains 2025: తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పెరగనున్న రద్దీ, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించుకుంది. పండుగకు ప్రయాణికులు జిల్లా మీదుగా రాకపోకలు సాగించేందుకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు మంగళవారం ప్రకటించింది.

Special Trains: సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే
Special Trains
Anand T
|

Updated on: Dec 17, 2025 | 11:18 AM

Share

తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని ఉద్దేశంతో.. ప్రయాణికులు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు పేర్కొంది. పండగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రతి ప్రయాణికులు ఈ ప్రత్యేక రైల్వే సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది. రైల్వే శాఖ ప్రకటన ప్రకారం.. సికింద్రాబాద్‌ – శ్రీకాకుళం మధ్య 07288, 07289 నంబర్‌ గల రెండు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9,10,11,12 తేదీలలో ప్రయాణికుల అందుబాటులో ఉండనున్నాయి. ఈ స్పెషల్ ట్రైన్ సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు 12,30కు గమ్యస్థానానికి చేరుకుంటుంది.

  • ఇక సికింద్రాబాద్‌ – శ్రీకాకుళం రోడ్డు మధ్య నడిచే 07290/07291 నంబర్‌ గల మరో రెండు రైళ్లు జనవరి 10, 11, 12, 13, 16, 17, 18, 19 తేదీలలో ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ట్రైన్‌ సాయంత్రం 3.30కు బయల్దేరి మరుసటి రోజు 8:10 నిమిషాలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.
  • దీంతో పాటు శ్రీకాకుళం రోడ్డు – సికింద్రాబాద్‌ మధ్య రాకపోకలు సాగించే 07295 నెంబర్ గల ట్రైన్ జనవరి 14వ తేదీన ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఈ ట్రైన్ మధ్యాహ్నం 3:30 నిమిషాలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8:10 నిమిషాలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
  • అలాగే సికింద్రాబాద్‌ – శ్రీకాకుళం రోడ్డు మధ్య రాకపోకలు సాగించే 07292 నంబర్‌ గల రైలు జనవరి 17వ తేదీన కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఈ ట్రైన్ రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:30 గమ్యస్థానానికి చేరుకుంటుంది.
  • ఇక శ్రీకాకుళం రోడ్డు – సికింద్రాబాద్‌ మధ్య రాకపోకలు సాగించే 07293 నంబర్‌ గల రైలు జనవరి 18వ తేదీన ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.ఈ ట్రైన్ మధ్యాహ్నం 3:30 నిమిషాలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8:10 నిమిషాలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
  • ఇక చివరగా వికారాబాద్‌ – శ్రీకాకుళం రోడ్డుకు మధ్య రాకపోకలు సాగించే 07294 నంబర్‌ గల రైలు జనవరి 13వ తేదీన ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని.. ఇది రాత్రి 7:15 నిమిషాలకు బయల్దేరి.. ఇవి రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని రైల్వే స్టేషన్‌ల గుండా మరుసటి రోజు మధ్యా మధ్యాహ్నం 12:30కు శ్రీకాకుం రోడ్డుకు చేరుకుంటుంది.

మరిన్ని వివరాల కోసం సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..
రూ.50లక్షలు పెడితే రూ.100కోట్లకు పైగా వసూళ్లు
రూ.50లక్షలు పెడితే రూ.100కోట్లకు పైగా వసూళ్లు
IPL 2026 Auction: వేలం తర్వాత మారిన ముగ్గురు కెప్టెన్లు..
IPL 2026 Auction: వేలం తర్వాత మారిన ముగ్గురు కెప్టెన్లు..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అదే హీరో సినిమాలో హీరోయిన్..!
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అదే హీరో సినిమాలో హీరోయిన్..!
గుడ్‌న్యూస్.. అమెరికాలో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్ ఏర్పాటు!
గుడ్‌న్యూస్.. అమెరికాలో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్ ఏర్పాటు!
వేలంలో రూ. 25 కోట్లతో రికార్డ్.. కట్‌చేస్తే డకౌట్‌
వేలంలో రూ. 25 కోట్లతో రికార్డ్.. కట్‌చేస్తే డకౌట్‌