AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ అంటే ఈ అమ్మడిదే..! చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు

ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. చేసిన ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇతర బాషల నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు చాలా మంది తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు.తక్కువ సమయంలోనే స్టార్స్ గా మారారు.

లక్ అంటే ఈ అమ్మడిదే..! చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
Actress
Rajeev Rayala
|

Updated on: Dec 17, 2025 | 11:08 AM

Share

స్టార్ డమ్ కోసం చాలా మంది హీరోయిన్స్ ఎంతో కష్టపడుతున్నారు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అలాగే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కాగా కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాగే తక్కువ సమయంలోనే స్టార్ డమ్ తెచ్చుకుంటున్నారు. ఇతర భాషలనుంచి మన దగ్గర క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పటికే చాల మంది హీరోయిన్ అలా స్టార్స్ గా మారినవారే వారిలానే ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా తెలుగులో వరుస అవకాశాలతో దుసుకుపోతుంది. రీసెంట్ గానే వరుస హిట్స్ అందుకుంది. మొన్నామధ్య ఆమె నటించిన సినిమా ఏకంగా రూ. 300కోట్ల వరకు వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతే కాదు ఈ సినిమా హిట్ తో ఈ చిన్నది ఏకంగా 4 సినిమా ఆఫర్స్ అందుకుంది. ఆతర్వాత వచ్చిన సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇంతకూ ఆ చిన్నది ఎవరో తెలుసా.?

విజయ్ దేవరకొండ సినిమాతో ఊహించని క్రేజ్.. ఈ అందాల భామను గుర్తుపట్టారా.?

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అందాల తార.. శ్రీనిధి శెట్టి. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి ఆతర్వాత మిస్ సుప్రనేషనల్ 2016 విజేత అయ్యింది. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తుంది. 2015లో మిస్ కర్ణాటక , మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లను, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. మిస్ సుప్రనేషనల్ 2016లో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించి, ఈ టైటిల్‌ను గెలుచుకున్న రెండో భారతీయురాలైంది. ఇక ముద్దుగుమ్మ 2018లో కన్నడ చిత్రం KGF: ఛాప్టర్ 1లో రీనా దేశాయ్ పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. KGF: ఛాప్టర్ 2 (2022)లో కూడా ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.

ఇవి కూడా చదవండి

టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. మరో వైపు ఫిజయో థెరపిస్ట్.. ఈ వయ్యారి భామ ఎవరో తెలుసా.?

రీసెంట్ గానే తెలుగులోకి అడుగుపెట్టింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు ఈ సినిమా ఏకంగా రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే నాలుగు సినిమాలు లైనప్ చేసింది ఈ భామ. ఇటీవలే తెలుసు కదా అనే సినిమా చేసింది.. సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఇప్పటికీ ఫీల్ అవుతున్నా..! 7/G బృందావన్ కాలనీ మిస్ అయిన హీరో.. ఆయన చేసుకుంటే మరోలా ఉండేది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us