టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. మరో వైపు ఫిజయో థెరపిస్ట్.. ఈ వయ్యారి భామ ఎవరో తెలుసా.?
చాలా మంది హీరోయిన్లలాగే ఈ ముద్దుగుమ్మ కెరీర్ కూడా బుల్లితెరతోనే ప్రారంభమైంది. 2012లో ఓ టీవీ షోతో స్మాల్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చిందీ అందాల తార. ఆ తర్వాత 2017లో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాలోనే వరుణ్ ధావన్, అలియా భట్ వంటి స్టార్ హీరోలు, హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే కానీ స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది కోట్లు కూడబెడుతున్నారు. మరి కొంతమంది మాత్రం కనిపించకుండా పోతున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంటుంది. చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత హీరోయిన్స్ గా మారి సక్సెస్ అవుతున్నారు. వారిలో ఈ చిన్నది ఒకరు. చిన్న చిన్న పాత్రలు చేసి ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారింది. ఈ అమ్మడు హీరోయిన్ మాత్రమే కాదు డాక్టర్ కూడా.. ఇంతకూ ఆ అందాల భామ ఎవరో గుర్తుపట్టారా.? ఒక ఫీల్ గుడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో ఈ అమ్మడి అందం, అభినయానికి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.
ఆకాంక్ష సింగ్. తొలి సినిమాతోనే మంది క్రేజ్ తెచ్చుకుంది. ఇక రెండో సినిమా అవకాశం కూడా వెంటనే వచ్చింది. అది కూడా అక్కినేని అందగాడు నాగార్జున, న్యాచురల్ స్టార్ నానిల సినిమాలో హీరోయిన్ ఛాన్స్. ఈ సినిమా కూడా హిట్ అయ్యింది. అయితే దీని తర్వాత ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కు వెళ్లిపోయింది. మధ్యలో ఒకటి, రెండు తెలుగు సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేదు. పలు హిందీ, కన్నడ, తమిళ్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అందాల తార చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. ఇటీవలే కొత్త కారు కూడా కొనుక్కొన్న ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు ఆకాంక్ష సింగ్.. ఇలా అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ అక్కినేని సుమంత్ నటించిన ఫీల్ గుడ్ మూవీ మళ్లీ రావా హీరోయిన్ అంటే కళ్ల ముందు ఇట్టే ఓ అందమైన రూపం మెదులుతుంది.
ఆకాంక్ష సింగ్ చివరిగా షష్టి పూర్తి అనే సినిమాలో నటించింది. అన్నట్లు ఈ హీరోయిన్ గురించి ఇటీవల ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఈ బ్యూటీకి పదేళ్ల క్రితమే పెళ్లైంది. తన చిరకాల ప్రియుడు మార్కెటింగ్ ప్రొఫెషనల్ అయిన కునాల్ సైన్‌ను 2014లోనే వివాహం చేసుకుంది ఆకాంక్ష. మొన్నామధ్య తన పదో పెళ్లి రోజును కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. కాగా ఉన్నత చదువులు అభ్యసించిన ఆకాంక్ష ఫిజయో థెరపిస్ట్ కూడా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలపై ఓ లుక్ వేయండి మరి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








