AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thamma OTT : ఓటీటీలోకి వచ్చేసిన రష్మిక హారర్ మూవీ.. ఫ్రీగా చూసేయండి..! స్ట్రీమింగ్ ఎక్కడంటే

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 9 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకుంది. 9 ఏళ్ల కెరీర్ లో నాలుగు భాషల్లో మొత్తం 25 మూవీస్ లో నటించింది రష్మిక. ఈ సినిమాల్లో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తో పాటు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సినిమాలు ఎన్నో ఉండటం విశేషం

Thamma OTT : ఓటీటీలోకి వచ్చేసిన రష్మిక హారర్ మూవీ.. ఫ్రీగా చూసేయండి..! స్ట్రీమింగ్ ఎక్కడంటే
Rashmika Thama
Rajeev Rayala
|

Updated on: Dec 16, 2025 | 12:14 PM

Share

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ ఈ అందాల భామ తన సత్తా చాటుతుంది. ఈ వారం కొత్తకొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. అందులో ఒకటి ‘ద గర్ల్‌ఫ్రెండ్’ శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే అంతకన్నా ముందే రష్మిక నటించిన ఓ అడ్వెంచర్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో సందడిచేస్తుంది. ఆ సినిమా ఎదో కాదు బాలీవుడ్ లో నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ థామా. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మాడాక్ హారర్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్నా బేతాళి రాక్షసిగా కనిపించింది.. రక్తం తాగే వ్యాంపైర్ పాత్రలో అదరగొట్టింది రష్మిక. ఈ సినిమాలో రష్మిక మందన్నతో పాటు ఆయుష్మాన్ ఖురాన్ కీలక పాత్రలో నటించి మెప్పించాడు.

అదేవిధంగా ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్ గా భయపెట్టాడు. ఇక ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో యాక్ట్ చేస్తోంది రష్మిక. దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సుమారు రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి.

థియేటర్లలో ఆడియెన్స్ ను భయపెట్టిన ఈ మూవీ మొన్నామధ్య సడెన్ గా ఓటీటీలోకి వచ్చింది. థామా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 02 నుంచి ఈ హారర్ థ్రిల్లర్ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. ప్రస్తుతం హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కాగా  థామా మూవీ ఇప్పటివరకు రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. అంటే అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రైబర్లు కూడా ఈ మూవీ చూడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. ఇక ఇప్పుడు ఉచితంగా చూసే అవకాశం కలిపించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.