Bigg Boss Telugu 9: చివరి వారంలోనూ అదే రచ్చ.. నువ్వు మారవా..!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆఖరి అంకానికి చేరుకుంది. సుమారు మూడు నెలల క్రితం (సెప్టెంబర్ 07) ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు ఈ వారంలోనే ఎండ్ కార్డ్ పడనుంది. ఇప్పటివరకు ఊహించని ట్విస్టులతో బుల్లితెర ఆడియెన్స్ కు మంచి వినోదం అందించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది.

బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ కు వచ్చేసింది. ఈ వారంతో బిగ్ బాస్ సీజన్ 9 పూర్తికానుంది. గతవారం హౌస్ నుంచి ఇద్దరూ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. శనివారం ఎపిసోడ్ లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. ఆతర్వాతి ఎపిసోడ్ లో భరణి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. దాంతో హౌస్ లో టాప్ 5 మెంబర్స్ ఉన్నారు. ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజన, డీమన్ పవన్, కళ్యాణ్ హౌస్ లో ఉన్నారు. వీరిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అవ్వనున్నారు. కాగా కళ్యాణ్, తనూజ మధ్య రేస్ నడుస్తుంది. ఈ ఇద్దరిలోనే ఒకరు విన్నర్ అవ్వనున్నారని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. బయట ఓటింగ్ లో కూడా కళ్యాణ్ టాప్ లో దూసుకుపోతున్నాడు. కళ్యాణ్ తర్వాత తనుజ ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో ఉంది.
ఇక నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో వన్స్ మోర్ అంటూ మరో టాస్క్ ఇచ్చాడు. బెలూన్ టాస్క్ ఇచ్చాడు. హౌస్ లో ఉన్న ఆరుగురిలో జోడీగా ఎవరు ఉంటారు అనేది మీరే డిసైడ్ అవ్వండి అని చెప్పారు. దాంతో హౌస్ లో డిస్కషన్ మొదలైంది. సంచలక్ గా డీమన్ ఉండాలని ఇమ్మాన్యుయేల్ , తనూజ చెప్పడంతో డీమన్ దానికి ఒప్పుకోలేదు. నేను కూర్చొను, కావాలంటే మీరు కూర్చోండి అంటూ తేల్చిచెప్పాడు. ఈరోజు నన్ను కూర్చోబెడితే .. రేపటి నుంచి అస్సలు కూర్చోవాల్సి వచ్చినప్పుడు నేను అస్సలు కూర్చోను అని చెప్పాడు. కానీ చివరకు డీమన్ సంచలక్ గా చేశాడు.
తనూజ- కళ్యాణ్ ఒక జోడీ, సంజన -ఇమ్మాన్యుయేల్ ఒక జోడీగా ఈ టాస్క్ ఆడారు. అయితే ఈ టాస్క్ లో ముఖానికి ఓ ముళ్ల మాస్క్ పెట్టుకొని బాక్స్ లో ఉంది తమ పార్ట్నర్ వేసే బెలూన్ ను ముఖానికి తగలకుండా గాలిలో ఉండేలా ఊదాల్సి ఉంటుంది. అలా ఎవరి బెలూన్ గాలిలో ఎక్కువ సేపు ఉంటుందో వారే విన్నర్ అని చెప్పాడు బిగ్ బాస్. బెలూన్ గాలిలో ఉన్నప్పుడు బెల్ కొట్టకుండా చూస్తూ ఉండిపోయిన తనూజ బెలూన్ పగిలిపోయిన తర్వాత వెళ్లి బెల్ కొట్టింది. అది కరెక్ట్ కాదు అని ఇమ్మాన్యుయేల్ చెప్పినా వినకుండా తనూజ తన పద్దతిలో వాదన పెట్టుకుంది. ఆతర్వాత ఏం జరిగింది ఎవరు విన్ అయ్యారు అనేది నేటి ఎపిసోడ్ లో చూడాలి.








