ఇప్పటికీ ఫీల్ అవుతున్నా..! 7/G బృందావన్ కాలనీ మిస్ అయిన హీరో.. ఆయన చేసుకుంటే మరోలా ఉండేది
ఇప్పటివరకు వచ్చిన సినిమాలంటిలో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సినిమా ఏదైనా ఉంది అంటే టక్కున చెప్పే 7/జి బృందావన్ కాలనీ. ఈ సినిమాకు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా క్లాసిక్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో క్లాసిక్ హిట్ సినిమాలు తెరకెక్కి.. ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయిన సినిమాల్లో 7/G బృందావన్ కాలనీ మూవీ ఒకటి.. సుమారు 22 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ అప్పట్లో యూత్‌ను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమాలో నిర్మాత ఏఎం రత్నం తనయుడు రవికృష్ణ హీరోయిన్‌గా నటించాడు. సోనియా అగర్వాల్ కథానాయిక. సుమన్ శెట్టి, చంద్రమోహన్, సుదీపా పింకీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నమ్ నిర్మించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు.
తమిళంలో 7/G రెయిన్‌బో కాలనీగా విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగులో 7/G బృందావన్ కాలనీగా రిలీజై సెన్సేషన్ విజయాన్ని అందుకుంది. హీరో, హీరోయిన్ల నటన, సుమన్ శెట్టి, యువన్ శంకర్ రాజా బాణీలు..ఇలా బృందావన కాలనీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇక తొలిసినిమాతోనే ఉత్తమ డెబ్యూ హీరోగా ఫిలింఫేర్ అందుకున్నాడు రవికృష్ణ. ఇదే సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ సోనియా అగర్వాల్. డైరెక్టర్ సెల్వ రాఘవన్ క్రేజీ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు.
అయితే 7/G బృందావన్ కాలనీ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.? ఆయన ఎవరో కాదు అల్లరి నరేష్. గతంలో ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. దర్శకుడు సెల్వ రాఘవన్ నాకు మంచి ఫ్రెండ్.. ఆయన తమిళ్ లో చేసిన సినిమాలను నేను రీమేక్ చేశా.. నేను అనే సినిమాలో నా నటన చూసి బాగా చేశావ్ అని నన్ను పొగిడాడు. అలాగే 7/G బృందావన్ సినిమా కథను నీతో చేయాలనుకున్నా అని సెల్వ అన్నాడు. అప్పుడు అబ్బా చెప్పాల్సింది కదా.. నేనే చేసేవాడిని అని నేను అన్నాను.. ఇప్పటికీ ఆ సినిమా మిస్ అయినందుకు చాలా ఫీల్ అవుతున్నాను అని చెప్పుకొచ్చారు అల్లరి నరేష్. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెయ్యాల్సింది అన్న. నువ్వు చేసి ఉంటే ఆ సినిమా మరింత విజయం సాధించేది.. నువ్వు స్టార్ హీరో అయ్యేవాడివి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








