Mehreen Kaur: అవ్వన్నీ పుకార్లే ఎవ్వరూ నమ్మొద్దు..! క్లారిటీ ఇచ్చిన నాని హీరోయిన్
సినీ పరిశ్రమలో హీరోయిన్గా నిలదొక్కుకోవాలంటే అందం, టాలెంట్ మాత్రమే కాదు.. కాసింత అదృష్టం ఉండాల్సిందే. తొలి సినిమాతోనే మంచి విజయం అందుకుని… ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలతో సరిపెట్టుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. సరైన హిట్ కోసం ఎదురుచూస్తూ.. ఎప్పటికప్పుడు నెట్టింట అభిమానులతో ఇంట్రాక్ట్ అయ్యేందుకు తెగ యాక్టివ్ గా ఉంటున్నారు

క్యూట్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా. నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో హిట్స్ అందుకుంది. జవాన్, పంతం, కవచం సినిమాలతో ఫ్లాప్స్ అందుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన F2, F3 సినిమాలతో హిట్స్ అందుకుంది. ఇదిలా ఉంటే కెరీర్ పీక్ లో ఉండగానే.. 2021లో అడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ నిశ్చితార్థం జరిగింది.
ఇది జరిగిన కొన్ని నెలలకే ఈ ఇద్దరూ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఆతర్వాత సోషల్ మీడియాతో బిజీగా గడిపిన మెహరీన్. 2023లో చిరంజీవ్ మక్వానాతో నిశ్చితార్థం చేసుకుందని. ఇటీవలే ఈ ఇద్దరూ హైదరాబాద్ లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాంతో అందరూ మెహ్రీన్ కు నిజంగానే పెళ్లి చేసుకుందా.? అని షాక్ అవుతున్నారు.దాంతో తన పెళ్లి పై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చింది. పెళ్లి పై వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అవ్వన్నీ అసత్య ప్రచారాలని తెలిపింది మెహ్రీన్.
ప్రస్తుతం మెహ్రీన్ సినిమాల కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ రేంజ్లో అందరు ఆరబోస్తుంది. ఎక్కువగా వెకేషన్స్ తోనే గడుపుతుంది ఈ అమ్మడు. అందం అభినయం ఉన్నా మెహ్రీన్ కు ఎందుకు అవకాశాలు రావడం లేదు అని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. మెహ్రీన్ తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే మెహ్రీన్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. గ్లామర్ లుక్ లో అదరగొట్టింది మెహరీన్. ఈ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








