SRH Full Squad: అసలే బీభత్సం.. ఆపై తుఫాన్ ఎంట్రీ.. కావ్యపాప స్వ్కాడ్ చూస్తే సుస్సుపోసుకోవాల్సిందే
SRH Full Squad, IPL 2026: అబుదాబిలో జరిగిన IPL 2026 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్‌లను కొనుగోలు చేసింది. అలాగే, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి విధ్వంసకర ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్‌లో క్లాసెన్, ఇప్పుడు కొత్తగా చేరిన లివింగ్‌స్టోన్ రాకతో SRH బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా మారింది.

Sunrisers Hyderabad Full Squad, IPL 2026: ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. తమ కోర్ టీమ్‌ను అలాగే అట్టిపెట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ, జట్టు బలాన్ని పెంచేందుకు పలువురు కీలక ఆటగాళ్లను భారీ ధరకు కొనుగోలు చేసింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ కోసం ఏకంగా రూ. 13 కోట్లు వెచ్చించడం విశేషం.
వేలంలో SRH కొనుగోలు చేసిన ఆటగాళ్లు: అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్‌రైజర్స్ సొంతం చేసుకున్న ఆటగాళ్లు ఎవరో ఓసారి చూద్దాం..
లియామ్ లివింగ్‌స్టోన్ (రూ. 13 కోట్లు) – స్టార్ ఆల్ రౌండర్
జాక్ ఎడ్వర్డ్స్ (రూ. 3 కోట్లు)
సలిల్ అరోరా (రూ. 1.5 కోట్లు)
శివమ్ మావి (రూ. 75 లక్షలు)
శివాంగ్ కుమార్ (రూ. 30 లక్షలు)
సాకిబ్ హుస్సేన్ (రూ. 30 లక్షలు)
ఓంకార్ టార్మలే (రూ. 30 లక్షలు)
అమిత్ కుమార్ (రూ. 30 లక్షలు)
ప్రఫుల్ హింగే (రూ. 30 లక్షలు)
క్రైన్స్ ఫులేత్రా (రూ. 30 లక్షలు)
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు (Retained Players), ప్రస్తుత జట్టు: గత సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన కీలక ఆటగాళ్లను SRH వదులుకోలేదు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో జట్టు బలంగా కనిపిస్తోంది.
కీలక ఆటగాళ్లు: పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్.
ఇతర ఆటగాళ్లు: నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్స్, కమిందు మెండిస్, ఈషాన్ మలింగ, జీషన్ అన్సారీ, అనికేత్ వర్మ, ఆర్. స్మరన్, హర్ష్ దూబే.
విడుదల చేసిన ఆటగాళ్లు: ఆడమ్ జంపా, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్, అభినవ్ మనోహర్, అధర్వ తైదే, సచిన్ బేబీ, సిమర్‌జీత్ సింగ్‌లను జట్టు యాజమాన్యం వదులుకుంది.
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి విధ్వంసకర ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్‌లో క్లాసెన్, ఇప్పుడు కొత్తగా చేరిన లివింగ్‌స్టోన్ రాకతో SRH బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా మారింది. బౌలింగ్‌లో పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ వంటి అనుభవజ్ఞులు జట్టుకు అండగా నిలవనున్నారు. 2026 సీజన్‌లో టైటిల్ లక్ష్యంగా సన్‌రైజర్స్ బరిలోకి దిగుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




