Chandrababu Naidu Arrest: ప్రాథమిక ఆధారాలున్నాయ్.. చంద్రబాబు రిమాండ్‌పై ఏసీబీ కోర్టు తీర్పు కాపీ విడుదల..
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అనంతరం చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరుపున లాయర్ లూథ్రా.. కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరుపు న్యాయవాది సుధాకర్ రెడ్డి బలంగా వాదించారు. అయితే, చివరకు సీఐడీ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు రిమాండ్ విధిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది.

స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అనంతరం చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరుపున లాయర్ లూథ్రా.. కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరుపు న్యాయవాది సుధాకర్ రెడ్డి బలంగా వాదించారు. అయితే, చివరకు సీఐడీ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు రిమాండ్ విధిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు ఈ కేసుకు సంబధించిన తీర్పు కాపీ విడుదల చేసింది. స్కిల్ స్కాంలో చంద్రబాబుపై ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు చంద్రబాబు బెయిల్ తీర్పు కాపీలో వివరించింది. అవినీతి నిరోధక చట్టం కింద ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని.. నేరపూరిత కుట్ర, ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చడం, ప్రజాప్రతినిధిగా ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డం, ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడం.. తదితర ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని దానిలో అభిప్రాయపడింది. రూ.279 కోట్ల రూపాయల అవినీతి, అక్రమ పద్ధతుల్లో తరలింపు తద్వారా ప్రభుత్వ ఖజానకు నష్టం చేకూర్చారనేందుకు ప్రాథమిక ఆధారాలను సీఐడీ సమర్పించినట్లు వెల్లడించింది. స్కిల్ స్కామ్‌లో A 37 పాత్ర ఉన్నట్లు కనిపిస్తోందని చెప్పిన ధర్మాసనం.. ఈ సెక్షన్ల కింద 10 ఏళ్లు జైలుశిక్ష, జరిమానా ఉంటుందని అభిప్రాయపడింది. ఈ కేసులో నిందితుడిని జుడిషియల్ కస్టడీకి పంపేందుకు తగిన కారణాలున్నాయని తీర్పులో పేర్కొన్న ACB కోర్టు.. ఈ నెల 22 వరకు జుడిషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపింది.
కస్టడీని హౌస్ అరెస్టుగా మార్చేందుకు ప్రయత్నం..
ఇదిలాఉంటే.. చంద్రబాబు జుడిషియల్ కస్టడీని హౌస్ అరెస్టుగా మార్చాలని కోరుతున్న ఆయన తరపు న్యాయవాదులు పలు కోర్టు తీర్పులను ఉదాహరిస్తున్నారు. గౌతమ్ నవ్‌లఖా కేసులో సుప్రీంకోర్టు మే 12, 2021న ఇచ్చిన కేసును ఉదాహరణగా చూపాలని భావిస్తున్నారు. చంద్రబాబు తరపున న్యాయవాదులు వేసిన హౌస్ రిమాండ్ పిటిషన్ మరికాసేపట్లో విజయవాడ ACB కోర్టులో విచారణకు రానుంది. సెక్షన్ 167 కింద తగిన కేసుల్లో హౌస్ అరెస్టుకు ఆదేశించే అధికారం కోర్టులకు ఉంటుందని గౌతమ్ నవ్‌లఖా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వయస్సు, ఆరోగ్య పరిస్థితులు, నిందితుడి పూర్వ చరిత్ర, నేర స్వభావం ఆధారంగా న్యాయస్థానాలు నిర్ణయం తీసుకోవచ్చని గౌతమ్ నవ్‌లాఖా కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని చంద్రబాబు తరపున వాదిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా విజయవాడ ACB కోర్టు ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. మరి ఈ వాదనను విజయవాడ ACB కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా? చంద్రబాబు న్యాయవాదుల విజ్ఞప్తిని ACB న్యాయస్థానం మన్నిస్తుందా? వేచి చూడాలి.
ములాఖత్ కు ముగ్గురికి అనుమతి..
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో ఇవాళ ములాఖత్‌కు ముగ్గురు కుటుంబ సభ్యులకు అనుమతిచ్చారు అధికారులు. నారా లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరికి ములాఖత్‌కు అనుమతిచ్చారు. టీడీపీ మాజీ మేయర్ పరిమి వాసు నివాసంలో నారా లోకేష్ సహా చంద్రబాబు భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రికి కూతవేటు దూరంలోనే ఉంది పరిమి వాసు నివాసం. అదే నివాసం నుంచి చంద్రబాబుకు అల్పాహారంతో పాటు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. నారా లోకేష్‌ను కలిసేందుకు పరిమి వాసు నివాసానికి వచ్చారు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
బుల్లెట్ సీసీ కెమెరాల ఏర్పాటు..
రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర మూడు బుల్లెట్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ నెల 22 వరకూ చంద్రబాబు సెంట్రల్ జైలులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ జైలు చుట్టుపక్కల ప్రాంతంలో ఈ సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




