Telangana: 'పాపం చంద్రబాబు'.. టీడీపీ అధినేత అరెస్ట్‌పై మంత్రి హరీశ్ ఏమన్నారంటే..

Telangana: ‘పాపం చంద్రబాబు’.. టీడీపీ అధినేత అరెస్ట్‌పై మంత్రి హరీశ్ ఏమన్నారంటే..

Ram Naramaneni

|

Updated on: Sep 11, 2023 | 4:08 PM

గతంలో చంద్రబాబు.. ఐటీ, ఐటీ అనేవారని.. కేసీఆర్ వచ్చాక అటు ఐటీ డెవలప్ అవ్వడమే కాకుండా.. పల్లెల్లో కూడా అభివృద్ది ఉందని చెప్పారు. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు. జాబ్ క్రియేషన్‌లో సైతం రాష్ట్రం.. రాణిస్తుందన్నారు. తెలంగాణలో అన్ని రంగాల అభివృద్ధి జరగుతుందని ఆయన స్పష్టం చేశారు.  ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడిన వీడియో నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతుంది.

సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుంది. పాపం చంద్రబాబు నాయుడు అరెస్టైనట్టున్నారు. దాని గురించి మాట్లాడకూడదు గానీ గతంలో ఆయన ఐటీ ఐటీ అనేవారు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి జరిగింది, పల్లెల్లో వ్యవసాయం అభివృద్ధి చెందింది’ అని వ్యాఖ్యానించారు. ఐటీ ఉత్పత్తుల వృద్ది రేటులో తెలంగాణ నంబర్ వన్ అని హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ వచ్చిననాడు మూడున్నర లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే.. ఇవాళ 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని ఆయన తెలిపారు. కేవలం ఇటు ఐటీ వృద్ది చెందడం మాత్రమే కాదు. అటు వరి ధాన్యం ఉత్పత్తి సైతం పెరిగిందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో అన్ని రంగాల అభివృద్ధి జరగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Published on: Sep 11, 2023 03:38 PM