టీడీపీ కేంద్ర కార్యలయంలో నేతల కీలక భేటీ.. సమావేశానికి అధ్యక్షత వహించిన బాలయ్య
టీడీపీ కేంద్ర కార్యాలయానికి నందమూరి బాలకృష్ణ విచ్చేశారు. పార్టీ చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్‌పై చర్చించారు. యనమల, కంభంపాటి సహా పలువురు సీనియర్లతో భేటీ అయ్యారు. సమావేశానికి నందమూరి బాలకృష్ణ అధ్యక్షత వహించారు. భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ శ్రేణులు చేపట్టిన ఏపీ బంద్‌కు పాక్షిక స్పందన లభించింది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పాక్షిక స్పందన లభించగా రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో విజయవంతమైంది.
చంద్రబాబు అరెస్ట్. తెలుగునాట మరో పొలిటికల్ బ్లాస్టింగ్ కేసుగా జనం చూస్తున్నపరిస్థితి. కేవలం కేసులతోనే సరిపెట్టేదిశగా ఈకేసు నడవడంలే. స్కామ్ అంతు తేలేదాకా వెళ్లే సిట్చువేషన్ కనిపిస్తోంది. పైగా చంద్రబాబుపై పెట్టిన సెక్షన్‌లు అతి తీవ్రమైనవనిగా తెలుస్తోంది. అంతేనా చంద్రబాబుతోనే అరెస్ట్‌లు పర్వం ఆగదట…లింకులున్న ప్రతి ఒక్కరూ అరెస్ట్ కాక తప్పదని అధికారపార్టీ వార్నింగ్ ఇస్తోంది. కాగా చంద్రబాబు ప్రజంట్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. లోకేష్ కోర్టు ప్రొసీజర్స్ పనిలో ఉన్నారు. ఇక పార్టీ పరంగా బాధ్యత మాత్రం బాలకృష్ణ తీసుకున్నట్లు కనిపిస్తోంది. సోమవారం బంద్ తరహాలో మంగళవారం నుంచి ఏం చెయ్యాలన్నదానిపై పార్టీ తరఫున బాలకృష్ణ నిర్ణయం తీసుకోబోతున్నట్లు కనిపిస్తోంది. కాసేపటి క్రితం టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌కి వచ్చిన బాలయ్య, సీనియర్లతో మాట్లాడుతూ ఉన్నారు.
వైరల్ వీడియోలు
Latest Videos