Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: అవినీతి జరిగితే ఆధారాలెక్కడ..? నేనొస్తున్నా, మీకోసం నిలబడతా.. కార్యకర్తలకు బాలయ్య అభయం..

Balakrishna: అవినీతి జరిగితే ఆధారాలెక్కడ..? నేనొస్తున్నా, మీకోసం నిలబడతా.. కార్యకర్తలకు బాలయ్య అభయం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 12, 2023 | 12:24 PM

AP Skill development case: ‘నేనున్నా.. నేనొస్తున్నా.. మీకోసం నేను నిలబడతా’ అంటూ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు నందమూరి బాలకృష్ణ అభయం ఇచ్చారు. ‘ఇలాంటివి టీడీపీ ఎన్నో చూసింది.. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి.. లక్షల కోట్ల అప్పులు చేశారు. పాలన అంటే ఇదేనా..? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు బాలకృష్ణ. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇటువంటి చర్యలకు వైసీపీ పాల్పడుతోందని, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగినట్లుగా ఎటువంటి..

ఆంధ్రప్రదేశ్, సెప్టెంబర్ 12: చంద్రబాబు అరెస్ట్, కేసులకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేశారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. కక్షపూరితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబుతో ఇలా వ్యవహరిస్తోందనీ.. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని బాలకృష్ణ అన్నారు. టీడీపీ కార్యకర్తలకు పోరాటం కొత్తేమీ కాదని, మళ్లీ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు హిందూపురం ఎమ్మెల్యే. ‘నేనున్నా.. నేనొస్తున్నా.. మీకోసం నేను నిలబడతా’ అంటూ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు అభయం ఇచ్చారు. ‘ఇలాంటివి టీడీపీ ఎన్నో చూసింది.. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి.. లక్షల కోట్ల అప్పులు చేశారు. పాలన అంటే ఇదేనా..? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు బాలకృష్ణ. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇటువంటి చర్యలకు వైసీపీ పాల్పడుతోందని, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగినట్లుగా ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ.. స్కామ్‌ జరిగిందని క్రియేట్ చేశారని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. అలాగే చంద్రబాబాబు పేద విద్యార్థుల కోసం ఎన్నో విద్యాసంస్థలను తీసుకొచ్చారని తెలిపారు. ‘అసలు అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా..? ఛార్జిషీట్‌ ఎందుకు వేయలేదు..? రాజకీయ కక్ష సాధింపులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేద’ని బాలకృష్ణ పేర్కొన్నారు.

Published on: Sep 12, 2023 12:23 PM