CBN Arrest: చంద్రబాబు నవ్వుతూ రావాలి.. అరెస్ట్‌పై బోరున విలపించిన నన్నపనేని

CBN Arrest: చంద్రబాబు నవ్వుతూ రావాలి.. అరెస్ట్‌పై బోరున విలపించిన నన్నపనేని

Narender Vaitla

|

Updated on: Sep 12, 2023 | 6:30 PM

చంద్రబాబు అరెస్ట్‌ను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏ తప్పు చేయని తమ నాయకుడిని వైసీపీ ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసులు వేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ తప్పుడు కేసులను త్వరలోనే జయించి మళ్లీ చంద్రబాబు గారు బయటకు వస్తారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె బోరున విలపించారు...

స్కిల్ డెవపల్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్‌ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్‌ను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏ తప్పు చేయని తమ నాయకుడిని వైసీపీ ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసులు వేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ తప్పుడు కేసులను త్వరలోనే జయించి మళ్లీ చంద్రబాబు గారు బయటకు వస్తారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె బోరున విలపించారు. చంద్రబాబు గారు క్షేమంగా రావాలని భగవంతుడిని ప్రార్థించిన ఆమె.. రెండు, మూడు రోజుల్లోనే మళ్లీ చంద్రబాబు నవ్వుతూ అందరి ముందుకు వస్తారని నన్నపనేని ఆశించారు. ఈ సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడుతూనే ఏడ్చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..