Andhra Pradesh: పవన్ కల్యాణ్ చెబుతున్నవన్నీ సినిమా స్టోరీలే.. మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు..
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ కేసులో సుధీర్ఘ విచారణ అనంతరం ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడుకి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఈక్రమంలో వైసీపీ నేతలు చంద్రబాబు టార్గెట్‌గా పలు విమర్శలు చేస్తున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ కేసులో సుధీర్ఘ విచారణ అనంతరం ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడుకి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఈక్రమంలో వైసీపీ నేతలు చంద్రబాబు టార్గెట్‌గా పలు విమర్శలు చేస్తున్నారు. ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు, పవన్ కల్యాణ్ టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్లడంతో పవన్ కల్యాణ్ ఇక రాజకీయాలు మానేసి సినిమాలు తీసుకుంటే మంచిదంటూ ఏపీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు.. కేంద్ర నిఘా వర్గాల సమాచారం అంటూ పవన్ చెబుతున్నవన్నీ సినిమాస్టోరీలే అన్నారు అమర్నాథ్.
అయితే, వైసీపీ ప్రభుత్వంపై పవన్‌కల్యాణ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. వారాహియాత్ర సమయంలో కోనసీమజిల్లాల నుంచి 2వేల మంది రౌడీలను దింపి, 50 మందిని చంపేయ్యాలని ప్లాన్ చేసినట్లు కేంద్ర ఇంటలిజెన్స్‌వర్గాలు తెలిపాయని ఆరోపిస్తే, అదే రేంజ్‌లో కౌంటరిచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కేంద్ర నిఘావర్గాల సమాచారం అంటూ పవన్ చెబుతున్నవన్నీ సినిమాస్టోరీలే అంటూ కౌంటర్ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..