Kodali Nani: ‘ఉత్త పుత్రుడి కంటే.. దత్త పుత్రుడి హడావిడి ఎక్కువైంది..’ బాబు రిమాండ్‌పై నాని కామెంట్స్

36 గంటల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి చేదుకబురే అందింది. స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ప్రమేయముందన్న సీఐడీ వాదనతో ఏకీభవించింది విజయవాడ ఏసీబీ కోర్టు. ఈనెల 22వ తేదీ వరకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. భారీభద్రత మధ్య ఏసీబీ కోర్టు నుంచి రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశాలొచ్చాయి.

Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 10, 2023 | 8:13 PM

చంద్రబాబుకి రిమాండ్ విధింపు.. రాజమండ్రి జైలుకు తరలింపు… వైసీపీలో సంబరాలు… టీడీపీలో విషాదచ్ఛాయలు. తెలుగు రాజకీయాల్లో ఇదొక కీలక తరుణం. 371 కోట్ల అవినీతి కేసులో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్టు ప్రాధమికంగా నిర్ధారించిన విజయవాడ ఏసీబీ కోర్టు… రిమాండ్ విధిస్తూ స్పష్టమైన తీర్పునిచ్చింది. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు జైలు యోగం అనేది నేషనల్ బ్రేకింగ్‌ న్యూస్‌. చంద్రబాబు రాజకీయ జీవితంపై ఇదొక మాయని మచ్చ. అటు.. పెళ్లిరోజున జైలుకెళ్లాల్సి రావడం అనేది చంద్రబాబును వ్యక్తిగతంగా కుంగదీసే అంశం. తాజాగా ఇదే అంశంపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. దేవుడి ముందు ఎవరూ తప్పించుకోలేరని చంద్రబాబు విషయంలో నిజమైందన్నారు నాని. లోకేశ్ ఇప్పటికైనా డైలాగ్స్ మానేయ్యాలని హితవు పలికారు. స్కిల్ స్కామ్ చంద్రబాబును సీఎం జగన్ జైలుకు పంపిన విషయం కూడా లోకేశ్ తన రెడ్ బుక్‌లో రాసుకోవాలని ఎద్దేవా చేశారు. బాబును అరెస్ట్ చేయగానే.. అసలు పుత్రుడి కంటే దత్త పుత్రుడి హడావిడి ఎక్కువైందన్నారు. ప్యాకేజీ తీసుకొని , అర్ధరాత్రి వచ్చి పవన్‌కళ్యాణ్‌ హడావుడి చేశారని విమర్శించారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!