AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: తెల్లారేసరికి బ్యాంక్ క్లీన్ చేసేందుకు వచ్చిన సిబ్బంది.. గోడకు కనిపించింది చూడగా

దర్జాగా బ్యాంక్ దోచేయాలని అనుకున్నారు. కట్ చేస్తే.. ఆ బ్యాంక్ దోచేందుకు పక్కనే ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలో కన్నం వేశారు. ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి మరి. లేట్ ఎందుకు

Andhra: తెల్లారేసరికి బ్యాంక్ క్లీన్ చేసేందుకు వచ్చిన సిబ్బంది.. గోడకు కనిపించింది చూడగా
Representative Image
Raju M P R
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 16, 2025 | 1:20 PM

Share

తిరుపతి జిల్లాలో దుండగులు బ్యాంకు దోపిడీకి ప్రయత్నించారు. నాగలాపురం యూనియన్ బ్యాంక్‌కు కన్నం పెట్టారు. ఏకంగా బ్యాంకు మొత్తాన్ని చేయాలని భావించి చోరీకి ప్రయత్నించారు. ఈ మేరకు పక్కా ప్లాన్ వేశారు. యూనియన్ బ్యాంకుకు వెనుక వైపు ఉన్న సిమెంట్ గోడౌన్‌ను ఎంచుకున్నారు. సిమెంట్ గోడౌన్ షట్టర్‌ను కట్ చేసి లోపలికి వెళ్లారు. గోడౌన్‌కు, బ్యాంకుకు మధ్య ఉన్న గోడకు కన్నం పెట్టారు. సిమెంట్ గోడౌన్‌లో కరెంటు లేకపోవడంతో బ్యాటరీ కట్టర్‌ను ఉపయోగించి కన్నం పెట్టిన దుండగులు మనిషి వెళ్లేంత రంధ్రం గోడకు పెట్టి దొంగలు ఇద్దరు లోపలికి వెళ్లారు. ముందుగా బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాలు, అలారం సెట్‌ను తొలగించిన దుండగులు బ్యాంకు లోపల లాకర్‌ను తెరిచేందుకు ప్రయత్నించారు. రాత్రంతా శ్రమించిన దొంగలు తెల్లారే వరకు ప్రయత్నం చేసినా సఫలం కాకపోవడంతో వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి దుండగులకు ఏర్పడింది.

ఇది చదవండి: రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు

దీంతో బ్యాంకు నుంచి వెళ్లేటప్పుడు సీసీటీవీ, డివిఆర్ బాక్స్‌లు, హార్డ్ డిస్క్‌లను దొంగలు తీసుకెళ్లారు. దీంతో ఉదయం యధావిధిగా సిబ్బంది బ్యాంక్‌కు చేరుకోగానే దొంగతనం ప్రయత్నం జరిగినట్లు భావించారు. బ్యాంకును మొత్తం పరిశీలించారు. బ్యాంకు వెనుకవైపు గోడకు కన్నం పెట్టినట్లు గుర్తించారు. బ్యాంకులోని లాకర్లు ఓపెన్ కాలేదని గుర్తించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత దొంగతనం కోసం జరిగిన ప్రయత్నంపై పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు బ్యాంకు ఉన్నతాధికారులు, పోలీసులు. అందుబాటులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఇద్దరు నిందితుల చిత్రాలను విడుదల చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి