Viral: ఆమెకు 25.. అతడికి 22.. రెండు వారాలుగా లాడ్జిలో గుట్టుగా కాపురం.. సీన్ కట్ చేస్తే
బెంగళూరులోని యలహంక లాడ్జిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక యువకుడు, ఒక మహిళ మరణించారు. ప్రేమికుడు సజీవ దహనం కాగా, ప్రియురాలు ఊపిరాడక మరణించింది. లాడ్జిలో అకస్మాత్తుగా జరిగిన అగ్నిప్రమాద కేసు దర్యాప్తులో ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన వివరాలు ఇవే. ఈ స్టోరీ చూసేయండి.

యలహంక న్యూటౌన్‌లోని ఒక లాడ్జిలో గురువారం సాయంత్రం 25 ఏళ్ల మహిళ, 22 ఏళ్ల యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు ఉత్తర కర్ణాటకకు చెందిన కావేరి, రమేషాగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో రమేషా గది లోపల కాలిన గాయాలతో మరణించాడని, కావేరి బాత్రూమ్ బయట ఊపిరాడక మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ సంఘటన రెస్టారెంట్ పైన ఉన్న కూల్ కంఫర్ట్ లాడ్జ్ మూడవ అంతస్తులో జరిగింది. లాడ్జ్ నుంచి పొగ, మంటలు వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షి అస్లాం ప్రకారం.. ‘ఇద్దరు వ్యక్తులు మెట్లపై నుండి పరిగెత్తుకుంటూ వచ్చినట్టు చూశాను. ఒకరు చేతులకు నిప్పంటించుకుని ఉన్నారు. నేను వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించాను.’ అని అన్నాడు.
ఇది చదవండి: రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు
ఈ మరణాలు ప్రమాదవశాత్తు జరిగాయా లేదా ఆత్మహత్యలా అనే విషయాలపై స్పష్టత లేదని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(నార్త్-ఈస్ట్) సజీత్ వీజే అన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం పంపామని అన్నారు. అనుమానాస్పద మృతిగా ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని.. వారి కుటుంబ సభ్యులు వారి రిలేషన్‌ను వ్యతిరేకించారన్నారు. కావేరి ఒక స్పాలో పనిచేస్తుండగా, రమేషా బెంగళూరులోని ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. ఈ జంట గత రెండు వారాలుగా లాడ్జిలో ఉంటున్నారు.
రమేషా పెట్రోల్ కొనుక్కుని, గొడవ తర్వాత తనపై పోసుకుని కావేరిని తగలబెట్టడానికి ప్రయత్నించాడని రెస్టారెంట్ సిబ్బంది ఆరోపించారు. ఆమె బాత్రూంలోకి వెళ్లి తాళం వేసుకుంది. కానీ అతను నిప్పంటించుకున్నాడు. కావేరి సహాయం కోసం కేకలు వేసి బాత్రూమ్ తలుపు దగ్గర కుప్పకూలిపోయింది. మంటలు త్వరగా వ్యాపించి గది మొత్తాన్ని చుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది జంటను రక్షించడానికి గ్లాస్ పగలగొట్టే సమయానికి దంపతులు అప్పటికే చనిపోయారని తెలిపారు.
ఇది చదవండి: మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా




