AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MRF: అప్పుడు రూ. 11 వేలు.. ఇప్పుడు రూ. 15 కోట్లు.. లచ్చిందేవిని తెచ్చిపెట్టిన పాత కాగితాలు

స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ మెంట్ అనేది భయంకరమైనది అని అందరూ అంటారు. కానీ అది తప్పు అని చాలాసార్లు రుజువైంది. మరి అందుకు నిదర్శనంగా జరిగిన ఓ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చెక్ చేయండి.

MRF: అప్పుడు రూ. 11 వేలు.. ఇప్పుడు రూ. 15 కోట్లు.. లచ్చిందేవిని తెచ్చిపెట్టిన పాత కాగితాలు
Mrf Shares
Ravi Kiran
|

Updated on: Oct 13, 2025 | 11:46 AM

Share

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ఏ వ్యక్తి అయినా కూడా అసహనంతో ఉండకూడదు. ఓపిక, సహనం చాలా అవసరం. ఏప్రిల్ 1993లో MRF షేర్లలో పెట్టుబడి పెట్టిన ఓ వ్యక్తి.. ఇప్పుడు కోటీశ్వరుడయ్యాడు. షేరుకు రూ.10 ఫేస్ వాల్యూతో 1993లో పబ్లిక్ లిస్టింగ్ అయింది MRF(మద్రాస్ రబ్బరు ఫ్యాక్టరీ). గత 25 సంవత్సరాలలో పెట్టుబడిదారులకు 7,40,109 శాతానికి పైగా రాబడిని అందించింది. ఏప్రిల్ 27, 1993న, కంపెనీ షేరు BSEలో రూ.11 వద్ద ముగిసింది. ఇక ఇప్పుడు గత ట్రేడింగ్ సెషన్‌లో ఈ కంపెనీ షేర్ రూ.1,55,510 వద్ద ముగిసింది. MRF షేర్లు గత కొన్ని సంవత్సరాలుగా పెట్టుబడిదారులకు భారీగా రాబడిని అందిస్తున్నాయి. లిస్టింగ్ సమయంలో ఓ వ్యక్తి చేతిలో 1000 షేర్లు.. అనగా అప్పటి రేటుతో రూ. 11 వేలు ఖర్చు పెట్టి తీసుకుంటే.. ఆ పెట్టుబడి ఇప్పుడు అక్షరాలా రూ. 15,50,00,000గా అవుతుంది.

ఇది చదవండి: రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు

BSE డేటా ప్రకారం, MRF షేర్లు ఆల్ టైంలో 8 వేలకుపైగా శాతం రాబడిని.. గడిచిన ఐదు సంవత్సరాలలో 168.06 శాతం రాబడిని అందించాయి. అలాగే గత ఒక సంవత్సరంలో 17.89 శాతం రాబడిని ఇవ్వడమే కాదు.. ఆరు నెలల్లోనూ పెట్టుబడిదారులకు 26.53 శాతం రాబడి అందించాయి. దీని బట్టి చూస్తే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు.. షార్ట్ టర్మ్‌కు కాకుండా లాంగ్ టర్మ్‌కు చూసుకుంటే మంచిదని బిజినెస్ అనలిస్టులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ కంపెనీని 1946లో మద్రాసులోని తిరువొట్టియూర్‌లో కె.ఎం. మమ్మెన్ మాప్పిళ్లై బొమ్మ బెలూన్ తయారీ యూనిట్‌గా ప్రారంభించారు. 1952లో, ఈ కంపెనీ ట్రెడ్ రబ్బరు తయారీలోకి అడుగుపెట్టింది. మద్రాస్ రబ్బరు ఫ్యాక్టరీ లిమిటెడ్ నవంబర్ 1960లో ఒక ప్రైవేట్ కంపెనీగా స్థాపించబడింది మరియు యునైటెడ్ స్టేట్స్‌లోని మాన్స్‌ఫీల్డ్ టైర్ & రబ్బరు కంపెనీతో భాగస్వామ్యంతో టైర్ల తయారీలోకి అడుగుపెట్టింది. 1967లో, ఇది అమెరికాకు టైర్లను ఎగుమతి చేసిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది. నేడు, ఈ కంపెనీ టైర్లు, ట్రెడ్‌లు, ట్యూబ్‌లు, కన్వేయర్ బెల్టులు, క్రికెట్ బ్యాట్‌లు వంటి రబ్బరు ఉత్పత్తులను తయారు చేస్తుంది.

ఇది చదవండి: మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..