Viral: బ్యాలెన్స్ చెక్ చేసేందుకు ఏటీఎంకు వెళ్లాడు.. స్క్రీన్‌పై కనిపించింది చూడగా
ప్రతీ వ్యక్తి జీతాలు పడే రోజు కోసం ఆశగా ఎదురుచూస్తారు. నెల ప్రారంభంలో ఉండే ఖర్చులు అలాంటివి మరి. పీఎఫ్, బీమా.. ఇతరత్రా అలవెన్స్‌లు కట్ అయ్యి.. తనకు ఎంత శాలరీ క్రెడిట్ అయ్యిందో చూసుకుంటారు. సరిగ్గా అలాగే ఓ వ్యక్తి తన అకౌంట్ పరిశీలించగా.. దెబ్బకు షాక్ అయ్యాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

మనకొచ్చే జీతం కంటే.. ఎక్కువ రెట్ల డబ్బు మన బ్యాంక్ అకౌంట్‌లోకి క్రెడిట్ అయితే.. అప్పుడెలా ఉంటుంది.? ఒక క్షణం మన గుండె ఆగినంత పనవుతుంది. ఆనందం ఉప్పొంగుతుంది. సరిగ్గా ఈ వ్యక్తికి కూడా అదే జరిగింది. కానీ చివర్లో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. వివరాల్లోకి వెళ్తే.. చిలీకి చెందిన ఓ వ్యక్తికి తన జీతం కంటే 330 రెట్లు ఎక్కువ మొత్తంలో డబ్బు తన ఖాతాలో క్రెడిట్ అయింది. ఈ తప్పిదం ఎలా జరిగిందో ఎవ్వరికీ అర్ధం కాలేదు. ఆ డబ్బును తిరిగిచ్చేస్తానని మొదటిగా చెప్పిన ఉద్యోగి.. ఆ తర్వాత కొద్దిరోజులకే అనూహ్యంగా రాజీనామా చేసి కంపెనీతో సంబంధాలు తెంచుకున్నాడు. ఆపై ఇది బ్యాంకింగ్ లోపం కారణంగా జరిగిందని కంపెనీ గుర్తించింది.
ఇది చదవండి: రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు
అలాగే సదరు ఉద్యోగి డబ్బు తిరిగి ఇవ్వకుండా పారిపోవడంతో.. కంపెనీ అతడిపై దొంగతనం అభియోగం మోపుతూ కేసు నమోదు చేసింది. కేసు కోర్టుకు వెళ్లగా.. దాదాపు మూడు సంవత్సరాలుగా చట్టపరమైన పోరాటం కొనసాగింది. ఆ ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా డబ్బు తిరిగి ఇవ్వలేదని, తద్వారా దొంగతనం అభియోగం మోపినట్టు కంపెనీ వాదించింది. మరోవైపు, ఇది బ్యాంకింగ్ తప్పిదమని, తమ క్లయింట్ ఎటువంటి నేరం చేయలేదని సదరు ఉద్యోగి తరపున లాయర్ వాదించారు.
సుదీర్ఘ విచారణ తర్వాత, శాంటియాగో కోర్టు ఈ కేసు తీర్పును సదరు ఉద్యోగికి ఫేవర్‌గా ఇచ్చింది. ఇది కేవలం బ్యాంక్ తప్పిదం మాత్రమేనని.. డబ్బు స్వీకరించిన సదరు వ్యక్తి ఎలాంటి హింస, మోసం లేదా ఉద్దేశపూర్వక చట్టవిరుద్ధతకు పాల్పడనందున, దానిని నేరంగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. ఈ నిర్ణయంతో కంపెనీకి పెద్ద దెబ్బ తగలగా.. ఉద్యోగికి లాటరీ వచ్చినట్లైంది. కాగా, ఈ తీర్పుపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. క్షణాల్లో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఇది చదవండి: మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా




