ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకునే అలవాటు మీకుందా.? మీరెలాంటివారో ఈజీగా చెప్పేయొచ్చు
కంటి ఆకారం, ముక్కు, పెదవులు, పాదాల ఆకారం.. లేదా బాడీ లాంగ్వేజ్.. ఇలా దేని నుంచైనా మనిషి వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చునని వ్యక్తిత్వ శాస్త్రం చెబుతోంది. ఈ మధ్యకాలంలో చాలామందికి ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకునే అలవాటు ఉంది. నడిచేటప్పుడు గానీ.. లేదా మాట్లాడాడేటప్పుడైనా వారు ఇలా చేస్తుంటారు.

భూమిపై ఉన్న ప్రతీ మనిషికి ఏదొక అలవాటు ఉంటుంది. కొందరు గోళ్లు కొరుక్కుంటుంటే.. మరికొందరు పదేపదే తన జుట్టును సరిచేసుకుంటారు. ఇంకొందరైతే సమయం దొరికినప్పుడల్లా అద్దంలో తనను తాను పదేపదే చూసుకుంటారు. హస్తసాముద్రికం, బాడీ లాంగ్వేజ్ ఆధారంగా వ్యక్తిత్వాలను చెప్పొచ్చు. ఇక కొందరికి తమ చేతులను ప్యాంట్‌లో పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఆధారంగా మనం మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు. అలా జేబుల్లో చేతులు పెట్టుకోవడం ఈతరం ఫ్యాషన్ మాత్రమే కాదు.. మనిషి వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. మరి అదేంటో చూసేద్దాం.
ఇది చదవండి: చిత్తు కాగితాలు అనుకునేరు.. 30 ఏళ్ల క్రితం రూ. వెయ్యి.. ఇప్పుడు రూ. 1.83 కోట్లు
మీరూ చేతులను ప్యాంట్ జేబుల్లో పెట్టుకుంటున్నారా.? దీని వెనుక అర్ధం ఏంటంటే.?
కొంతమంది వ్యక్తులు ఓ గ్రూప్‌లో ఉన్నప్పుడు తమ చేతులను ప్యాంట్ జేబుల్లో పెట్టుకుంటూ ఉంటారు. దానికి అర్ధం ఏంటంటే.? వారు వాళ్లందరితో సేఫ్‌గా ఉన్నారని భావిస్తారు. అంతేకాదు ఒకవేళ ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా కొందరు రిలాక్స్ కోసం ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకుంటారు.
ఆత్మవిశ్వాసం, అభద్రత:
ఇక మీ చేతులను ఎప్పుడూ ప్యాంట్ జేబుల్లో పెట్టుకోవడం అభద్రతకు సూచిక. కొందరు తమ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడానికి చేతులను ప్యాంట్ జేబుల్లో ఉంచుకుంటారు.
భావాలను రహస్యంగా ఉంచడం:
కొందరు తమ చేతులను ప్యాంట్ జేబుల్లో ఉంచుకుని.. తమ భావాలను వేరే వాళ్లకు తెలియనివ్వకుండా చూసుకుంటారు. అలా ఒకటి మాత్రం కాదు.. వాళ్ల భావాలను ఇతరులకు పంచుకోవడానికి ఇష్టపడరని కూడా దాని అర్ధం. ఇలాంటి అలవాటు ఉన్న వ్యక్తులు చాలా సంయమనంతో ఉంటారు.
రిలాక్స్:
ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకోవడం ఎప్పుడూ నెగటివ్ ఎనర్జీ మాత్రమే సూచించదు. రిలాక్సేషన్‌కి కూడా ఇది సంకేతం. ఆ తరహ వ్యక్తులు జీవితాన్ని తేలికగా, హాయిగా ఎలాంటి ఒత్తిడి లేకుండా గడపాలని కోరుకుంటారు.
అసౌకర్యంగా ఫీల్ కావడం:
కొందరు తాము ఉన్న చోట్ల ఎలాంటి అసౌకర్యంగా అనిపించినా తమ చేతులను ప్యాంట్ జేబుల్లో పెట్టుకుంటారు.
ఇది చదవండి: పాత బంగారాన్ని ఇచ్చి కమ్మలు కొంటానంది.. కట్ చేస్తే.. తను ఏం చేసిందంటే




