AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బర్రె పిల్ల కోసం సింహాలకు తల్లి బలి.. అమ్మ కోసం పిల్ల ఆహారం..కన్నీరు పెట్టిస్తోన్న తల్లిపిల్ల వీడియో..

అడవిలో నివసించే జంతువులు కూడా ప్రేమ త్యాగానికి మనుషుకంటే ఏ మాత్రం తక్కువ కాము అని తెలియజేస్తాయి. తమ పిల్లలను రక్షించుకోవడానికి సింహం, పులి, చిరుత వంటి మృగాలతో పోరాడే ఏనుగు, జిరాఫీ, జింక వంటి అనేక వీడియోలు చూస్తూనే ఉంటున్నాం.. పిల్ల కోసం తల్లి ప్రేమ, త్యాగం మనసుని కదిలిస్తుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఇలాంటిదే కనిపిస్తుంది. గేదె తన బిడ్డను కాపాడుకోవడానికి తన ప్రాణాలను త్యాగం చేస్తుంది.. అయితే తల్లికి ఏదో అవుతుందని.. అమ్మ కోసం వచ్చిన పిల్ల కూడా సింహానికి ఆహారంగా మారింది. ఈ దృశ్యం ఎంత బాధాకరంగా ఉంది అంటే ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తుంది.

బర్రె పిల్ల కోసం సింహాలకు తల్లి బలి.. అమ్మ కోసం పిల్ల ఆహారం..కన్నీరు పెట్టిస్తోన్న తల్లిపిల్ల వీడియో..
Viral Video
Surya Kala
|

Updated on: Oct 10, 2025 | 2:15 PM

Share

తల్లి తన బిడ్డ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటుంది. అవసరమైతే తన ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తుంది. ఇది మానవులలోనే కాదు జంతువులలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది., ఇది ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరినీ కొంచెం భావోద్వేగానికి గురి చేస్తుంది. ఈ వీడియోలో కొన్ని సింహాలు ఒక గేదెను.. దాని దూడను వెంబడించడం కనిపిస్తుంది. గేదె తనను తాను త్యాగం చేయకుండా తన బిడ్డను రక్షించలేనని గ్రహించినట్లు ఉంది.. అప్పుడు తన బిడ్డ తప్పించుకుని వెళ్ళడం కోసం సింహాలతో పోరాడి.. చివరి అలసి లొంగిపోయింది. అయితే.. ఈ వీడియో ముగింపు చాలా షాకింగ్‌గా ఉంది. అది చూసిన ఎవరినా సరే భావోద్వేగానికి గురై.. కన్నీరు పెట్టాల్సిందే.

వీడియోలో సింహాల నుంచి తప్పించుకునేందుకు ఒక గేదె తన దూడతో పరిగెడుతుండటం కనిపిస్తుంది. అయితే.. సింహాలు బర్రె పిల్ల దగ్గరగా వచ్చినప్పుడు.. తల్లి తన పిల్లను కాపాడుకోవాలని ఆశపడింది. వాటిని శక్తికి మించి ఎదుర్కొంది. అప్పుడు రెండు సింహాలు కలిసి బందీగా చేసి.. దాడి చేశాయి.. గేదె తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది.. అప్పుడే ఒక సింహం గేదె మెడను పట్టుకుంది. మరొక సింహం ఆమెను వెనుక నుండి పట్టుకుంది. దీనితో గేదె తప్పించుకోవడం కష్టమైంది. అయితే ప్రాణాల కోసం తల్లికంటె ముందుగా పరిగెత్తిన బర్రె పిల్ల వెనక్కి అకస్మాత్తుగా వచ్చి తన తల్లి చనిపోవడాన్ని చూస్తూ నిలబడిపోయింది. అప్పుడే వెనుకగా మూడవ సింహం వచ్చి తల్లి మరణాన్ని నిస్సహాయ స్థితిలో చూస్తున్న బర్రె పిల్లపై దూకింది. దానిని తన ఆహారంగా మార్చుకుంది. తల్లి పిల్ల ఇద్దరూ సింహాలకు ఆహరమై పోయాయి.

ఇవి కూడా చదవండి

వీడియో చూసిన తర్వాత భావోద్వేగానికి గురి ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @TheeDarkCircle అనే యూజర్‌నేమ్‌తో షేర్ చేయబడింది. ఈ 20 సెకన్ల వీడియోను ఇప్పటికే వేలాది మంది వీక్షించారు, వందలాది మంది వివిధ రకాల కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు.

వీడియో చూసిన తర్వాత ఒకరు “తల్లి ప్రేమ ఎల్లప్పుడూ గొప్పది. అయితే అడవి నియమాలు చాలా కఠినంగా ఉంటాయి.” మరొకరు నా హృదయం కన్నీరు పెట్టింది.. ఈ వీడియో చూడటం అంత సులభం కాదు.” ని కామెంట్ చేశారు. చాలా మంది వినియోగదారులు కూడా ఇది ప్రకృతి సత్యం అని.. మనుగడ కోసం రోజువారీ పోరాటం జరుగుతుందని అన్నారు.

వీడియోను ఇక్కడ చూడండి

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రేపట్నుంచే TSLPRB APP రాత పరీక్షల అడ్మిట్‌ కార్డులు.. లింక్ ఇదే
రేపట్నుంచే TSLPRB APP రాత పరీక్షల అడ్మిట్‌ కార్డులు.. లింక్ ఇదే
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
"నీ బుర్ర వాడకు, నేను చెప్పింది చేయి..": కేఎల్ రాహుల్ ఫైర్
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..