పచ్చి బఠానీలు లేదా శనగలు వేటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి? ఏది మీకు ప్రయోజనకారో తెలుసా
పచ్చి బఠానీలు, శనగలు రెండూ ఒకే కుటుంబానికి చెందినవి. అయితే వీటి ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువలు గణనీయంగా భిన్నంగా ఉంటాయి. ఈ రోజు పచ్చి బఠానీల్లో, శనగల్లో ఉండే పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.. దీంతో మీ అవసరాలకు అనుగుణంగా ఏది సరైన ఆహారామో తెలుసుకుంది ఎంచుకోవడం చాలా సులభం

పచ్చి బఠానీలు, పచ్చి శనగలు రెండూ పోషకాలు అధికంగా ఉండే ఆహారాలే. రెండూ భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం. రుచికరంగా ఉంటాయి. రెండూ పప్పుదినుసుల కుటుంబానికి చెందినవి. అయితే, వీటిలో పోషక విలువలు.. ప్రయోజనాలు విభిన్నంగా ఉంటాయి. రెండూ ఒకే ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని కొందరు అనుకుంటారు.. అయితే ఈ నమ్మకం నిజం కాదు. పచ్చి బఠానీలు విటమిన్ సి , ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. శనగలు ప్రోటీన్ కి అద్భుతమైన మూలం. కనుక ఏది తింటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.
నేటి బిజీ లైఫ్ లో అనారోగ్యకరమైన జీవనశైలిలో సమతుల్యతను కాపాడుకోవడం ఒక సవాలుగా మారింది. అందువల్ల ప్రతి ఒక్కరూ తాము తినే ఆహారంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. ఆహారంలో పూర్తి పోషకాహారాన్ని అందించే, బరువును నియంత్రించడంలో సహాయపడే ఆహారాలను చేర్చుకోవాలి. శీతాకాలంలో తినే పచ్చి బఠానీలు, శనగలు బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. రెండింటి పోషక విలువలను పరిశీలిద్దాం.
పచ్చి బఠానీలు అద్భుతమైన ప్రయోజనాలు పచ్చి బఠానీలు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. వాటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు సి , కె, ఫోలేట్, ఖనిజాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. హెల్త్‌లైన్ ప్రకారం పచ్చి బఠానీలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. వీటిల్లో గ్లైసెమిక్ సూచిక కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతేక్డు వీటిలో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. పచ్చి బఠానీలలో ఖనిజాలు, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. అయితే పచ్చి బఠానీలను ఎక్కువగా తీసుకుంటే కడుపు ఉబ్బరం వచ్చే ప్రమాదం ఉంది.
శనగలు ఆరోగ్య ప్రయోజనాలు శనగలు పోషకాల నిధి. ఇవి ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉంటాయి. వీటిల్లో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి పోషకాలు అద్భుతంగా ఉంటాయి. శనగల్లో బి విటమిన్లు , ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటి ప్రోటీన్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండినట్లు ఉంచడంలో సహాయపడుతుంది. తరచుగా ఆహార కోరికలను నివారించడంలో సహాయపడుతుంది. కండరాల పెరుగుదల కోరుకునే వారికి శనగలు ఒక అద్భుతమైన మూలం. హెల్త్‌లైన్ ప్రకారం 1 కప్పు శనగాల్లో సుమారు 14.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి శనగలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.
శనగలు లేదా గ్రీన్ బఠానీలలో ఏది ఎక్కువ ప్రయోజనకరం అంటే శనగలు, పచ్చి బఠానీలు రెండిటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే వాటి పోషక విలువలు గణనీయంగా మారుతూ ఉంటాయి. వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. శనగలు ప్రోటీన్ అద్భుతమైన వనరుగా పరిగణించబడుతున్నప్పటికీ కండరాల పెరుగుదలకు, బరువు నిర్వహణకు, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే పచ్చి బఠానీల్లో విటమిన్ సిలో సమృద్ధిగా ఉంటుది. బరువు తగ్గడానికి సహాయపడే తక్కువ కేలరీల ఆహారం. అయితే రెండింటినీ అధికంగా తీసుకోవడం వల్ల ఉబ్బరం, గ్యాస్ , మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. అందువల్ల మీ శారీరక అవసరాల ఆధారంగా రెండింటినీ తినే ఆహారంలో చేర్చుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




