గంజిని పారబోస్తున్నారా? అన్నం కన్నా అదే ఆరోగ్యం.. ఎందుకో తెలుసా?
తినడానికి ఏమీ లేని వాడికి గంజే పరమాన్నం అని పెద్దలు చెప్పిన సామెతకు కొంచెం అర్ధం మార్చి తినడానికి ఎన్ని ఉన్నా గంజి పరమాన్నమే.. ఎందుకంటే ఈ గంజిలో అనేక పోషకాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వృధాగా పారబోసే గంజిని ఇప్పుడు ఆధునిక రెస్టారెంట్స్ లో సూప్స్ అంటూ అత్యధికంగా ధర చెల్లించి మరీ తాగుతున్నాం.. అటువంటి ఈ గంజి ప్రాధాన్యతని నేటి తరానికి తెలియజేసే విధంగా ప్రతి సంవత్సరం గంజి దినోత్సవాన్ని అక్టోబర్ 10వ తేదీన జరుపుకుంటారు. ఈ రోజు గంజిని తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

ఇప్పుడు సమయంలో లేదు.. త్వర త్వరగా వంట అయిపోవాలంటూ చాలా మంది కుక్కర్ లో వంట చేస్తున్నారు. అయితే కొంత కాలం క్రితం వరకూ బియ్యాన్ని కుక్కలో పెట్టేవారు కాదు.. ఒక ఇత్తడి పాత్రలో కానీ..మట్టి కుండలో కానీ పోసి.. ఉడికించి గంజి వార్చేవారు. ఇలా వచ్చిన ద్రవ ప్రదర్ధాన్ని గంజి అంటారు. తర్వాత ఈ గంజిలో కొంచెం ఉప్పు నిమ్మరసం, కారం, లేదా మిరియాల పొడి. సొంటి పొడి అబిరుచికి తగినట్లు జోడించి తాగేవారు. ఈ గంజిని తాగడం వలన శరీరానికి అనేక పోషకాలు అందేవి. కాలం మారింది. ఆహారం తినే స్టైల్ మారింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆ పాత మధురం అంటూ పూర్వీకుల ఆహార నియమాలను పాటించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.
ఈ రోజు ప్రపంచ గంజి దినోత్సవం.. అంటే World Porridge Day అన్న మాట. గంజి వల్ల కలిగే పోషక ప్రయోజనాలను గురించి .. ముఖ్యంగా పేద పిల్లలకు ఆహారాన్ని అందించడంలో గంజి పాత్రను అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ గంజి దినోత్సవం జరుపుకుంటారు.
ప్రపంచ గంజి దినోత్సవాన్ని ఎవరు ప్రారంభించారంటే
మేరీస్ మీల్స్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఉన్న పిల్లలకు బడిలో ప్రతిరోజూ ఒక పూట భోజనం అందించాలనే లక్ష్యం ఈ ప్రపంచ గంజి దినోత్సవాన్ని ప్రారంభించింది. గంజి ప్రాముఖ్యతని ఆరోగ్య ప్రయోజనాలను తెలియజేయడానిక.. ఆకలితో ఉన్న పిల్లలకు పోషకాలు అందించే రోజు ఈ రోజు.
ఇప్పుడు గంజి వార్చడం అరుదుగా మారింది. లేదా గంజి వార్చినా.. పాత్రలో గంజిని వృథాగా పాడేస్తున్నారు. అటువంటి ఈ గంజి కేవలం ఒక ఆహార పదార్థం మాత్రమే కాదని.. పిల్లల జీవితాలను మార్చే శక్తిని ఈ గంజికి ఉందని.. పోషణను అందించే ముఖ్యమైన సాధనమని ఈ గంజి దినోత్సవం తెలియజేస్తుంది. ఈ రోజు గంజి వల్ల కలిగే ఈ ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..
గంజి తాగడం వలన కలిగే ప్రయోజనాలు:
శక్తి: గంజిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోజువారీ కార్యకలాపాలకు శక్తిని అందిస్తాయి.
జీర్ణక్రియ: గంజి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. పేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది.
పోషక విలువలు: బియ్యంతో మాత్రమే కాదు.. మొక్క కొన్న, గోధుమలు, మిల్లెట్స్ ఇలా రకరకాల తృణధాన్యాలతో గంజిని చేసుకోవచ్చు. ఇలా తయారుచేసే గంజిలో అనేక పోషకాలున్నాయి. ఇవి మొత్తం శ్రేయస్సుకు దోహదం చేస్తాయి.
స్కిన్ కేర్: గంజి చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.
శారీరక , మానసిక ప్రశాంతతను ఇస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు గంజిని తాగడం వలన జ్వర తీవ్రత తగ్గుతుంది.
ఇంట్లో మజ్జిగ లేకపోతే గంజిని అన్నంలో వేసుకుని తినండి. ఇలా చేయడం వలన కడుపు నిండుగా ఉండటమే కాదు శరీరంలో వేడిని తగ్గించి కూల్‌గా అయ్యేలా చేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




